నిన్న ఎంపీ బొత్స ఝాన్సీ సమైక్యవాదులకు, సీమాంద్ర రాజకీయ నాయకులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు జరుపుతున్న సమావేశం నుండి మద్యలో లేచి వెళ్లిపోవటం జరిగింది. నేను మాత్రం ఎంపీ పదవికి రాజీనామా చెయ్యనని సమైక్యవాదులకు తెల్చిచెప్పిన సీమాంద్ర మొట్టమొదటి మహిళా నాయకురాలు బొత్స ఝాన్సీ. సమైక్యాంద్ర ఉద్యమం పై చులకన భావం చూపి, సమావేశం నుండి మద్యలోనే వెళ్లిపోవటంతో.. సీమాంద్ర నాయకులు షాక్ తిన్నారు. అయితే ఈరోజు తన భార్య దారిలోనే .. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సీమాంద్ర నాయకులకు, సీమాంద్ర ఉద్యోగులకు, సమైక్యవాదులకు షాకిచ్చారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం బయటకు వచ్చిన సీమాంధ్ర మంత్రులను ....ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో మంత్రులను అడ్డుకున్నారు. సమైక్య రాష్ట్రం కోసం మంత్రులు రాజీనామాలు చేసి తమతో కలిసి ఉద్యమించాలని కోరారు. సీమాంధ్ర ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తున్నారని.... మంత్రులు కూడా తమతో కలవాలని ఉద్యోగులు కోరగా.... పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొద్దిగా అసహనం ప్రదర్శించారు. మీరు చేస్తున్నదే ఉద్యమమా అని ప్రశ్నించారు. తాము కూడా సమైక్య రాష్ట్రం కోసం కృషి చేస్తున్నామని బొత్స తెలిపారు. సత్తిబాబు నోటి నుండి రాలిన వ్యాఖ్యలపై సీమాంద్ర ఉద్యోగులు ఒక్కసారిగా కంగుతిన్నారు. నిన్న ఆయన భార్య, నేడు సత్తిబాబు.. ఇలా మాట్లాడటం పై సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కిరణ్ సమైక్యాంద్ర ముద్దు, తెలంగాణ వద్దు అంటూ అధిష్టానం వద్ద ఫైట్ చేస్తుంటే..సత్తిబాబు దంపతులు మాత్రం అందుకు విరుద్దంగా ఉండటం పై అనేక అనుమానులకు దారితీస్తుందని సీమాంద్ర ఉద్యోగులు అంటున్నారు. సత్తిబాబు ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ముందు ముందు ఎలా ఉంటాడో, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more