దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం పై మళ్ళీ ఇప్పుడు చర్చ ఊపందుకుంది. త్వరలో ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడని తమిళనాడులో వార్తలు ఊపందుకున్నాయి. గతంలో ఇలాంటి వార్తలు వచ్చినా రజినీ వాటిని ఖండించాడు. కానీ నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా, భాజాపా ఎన్నికల ప్రచార సారథిగా ఎన్నికైన తరువాత రజినీ రాజకీయాల్లో వస్తున్నాడనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మోడీ తన రాజకీయ వ్యూహాలకు అప్పుడే పదునుపెట్టినట్లనిపిస్తుంది. అందులో భాగంగానే తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతానికి కంకణం కట్టుకొని కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నాడు. తనకు ఎంతో సన్నిహితుడు అయిన రజినీకాంత్ ను రాజకీయాల్లోకి లాక్కొని రావటానికి మోడీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా తమిళనాడులో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంతో మంది సినీ స్టార్లు రాజకీయ రంగ ప్రవేశం చేసినా, రజినీకాంత్ మాత్రం రాజకీయ అరంగ్రేటం చేయలేదు. దీనికి కారణం జయలలితో ఉన్నవిభేధాలే అని చెబుతారు.
అయితే మోడీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, ఈయన రాజకీయాల్లోకి వచ్చి మోడీ ప్రధాని అవ్వడానికి ఈయన వంతు సహాయం చేస్తాడా లేదా అన్నది ప్రక్కన పెడితే... జనాల్లో బాగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొని వస్తే అక్కడ ఓటు బ్యాంకు కూడగట్టుకోవడమే కాకుండా, తమిళనాడులో పార్టీ బలోపేతం అవ్వడం మాత్రం ఖాయం. అదే టైంలో అక్కడి రాజకీయ ముఖ చిత్రం కూడా మారవచ్చు. ఇప్పటికే అక్కడ అవినీతి పార్టీలతో విసిగిపోయిన ప్రజలు కొత్త అభ్యర్థిని ఎన్నుకుంటారడంలో ఏ మాత్రం సందేహం లేదు. అదే కాకుండా రజినీకి ఉన్న ఫాయింగ్ కి గెలుపు కూడా అసాధ్యం కాకపోవచ్చు. సెప్టెంబర్ 26న తమిళనాడు తిరుచ్చిలో మోడీ ముఖ్య అతిథిగా ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకి దాదాపు లక్షకుపైగా హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు. ఈ సభ కోసం తిరుచ్చి వచ్చే మోడీ అప్పుడే రజనీని కూడా కలిసి ఈ అంశంపై చర్చించనున్నారని తెలుస్తోంది. మోడీ, రజినీ కలిసి తమిళనాడు రాజకీయాల్లో ఎటువంటి ప్రభంజనాన్ని స్రుష్టిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more