ప్రణబ్ ముఖర్జీ తర్వాత దేశాధ్యక్ష పీఠం దక్కించుకోవాలన్న ఆకాంక్ష దిగ్విజయ్‌ది.. రాహుల్ అంగీకరించకపోతే తానే ప్రధాని పదవిని అధిష్టించాలన్న ఆశయం చిదంబరానిది.. ఇవి సాధించుకోవాలంటే సోనియా విశ్వాసం పొందాలి. ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న కీలక సమస్య ఆంధ్రప్రదేశ్‌లో విభజనవాదం. దీన్ని పరిష్కరించగలిగితే సోనియా మెప్పు ఖాయం. దాన్ని ఆసరాగా చేసుకుని తమ ఆకాంక్షలు నెరవేర్చు కోవచ్చంటూ వీరిద్దరూ వ్యూహరచన చేశారు. ఇలాగే మరికొందరు ఈ రాష్ట్రంతో సంబంధంలేని వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్‌ను అతలా కుతలం చేయడంలో పోటీలు పడ్డారు. తిలాపాపం.. తలాపిడికెడన్న రీతిలో ఇక్కడి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, కేంద్రమంత్రులు, ఎంపీలే కాదు.. వీరంతా కూడా ప్రస్తుత రాష్ట్ర దుస్థితికి కారకులయ్యారు. గత నాలుగేళ్ళుగా రాష్ట్రం అట్టుడికిపోతోంది. 2009లో చిదంబరం ప్రకటన నాటి నుంచి అభివృద్ధి కుంటుపడింది. ఇరు ప్రాంతాలు ఉద్యమ కేంద్రాలుగా మారాయి.
రాష్ట్రంలోని పార్టీలన్నీ ఏదొక సమయంలో విభజనకు ఆమోదం తెలిపాయి. తమకభ్యంతరం లేదని లిఖితపూర్వకంగా అఖిలపక్ష సమావేశాలకు తెలియజశాయి. రెండు ప్రాంతాల్లోనూ వేర్వేరు అభిప్రాయాల్తో ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నాయి. విభజనాంశాన్ని సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగా పసిగట్టలేదు. కేంద్రం ఆలోచనపై వీరెవరికీ సమాచారమందలేదు. ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని కేంద్రం దృష్టికి తేవడంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధానే రాష్ట్ర ఎన్‌జిఓలకు తెలిపారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి ఆది నుంచీ తెలంగాణావాదాన్ని ప్రోత్సహించారు. కేంద్రం ముందు విభజనాంశాన్ని సమర్ధవంతంగా చర్చించగలిగారు. ఆయనకున్న అనుభవం సోనియాతో సహా కోటరీనేతల్తో ఉన్న సాన్నిహిత్యాల్ని ఇందుకు వినియోగించుకున్నారు. చాపకింద నీరులా విభజన ప్రయత్నాన్ని చేపట్టి కేంద్రాన్ని ఒప్పించగలిగారు. అదే సమయంలో సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులెవరూ ఈ విషయంపై దృష్టిపెట్టలేక పోయారు. వీరెవరికీ కోటరీవద్ద తగిన చనువులేదు. సోనియాతో చర్చించే సాహసంలేదు. కనీసం ఇక్కడి ప్రజల మనోభావాల్ని వివరించగలిగే ధైర్యం చేయలేక పోవడానికిదే కారణం. వీరి వైఫల్యాలకు కేంద్రమంత్రి చిదంబరం, దిగ్విజయ్‌సింగ్‌లు మరింత తోడయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తే దక్షిణపధాన తమిళనాడే అతిపెద్ద రాష్ట్రమౌతుంది. ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు కేంద్రంలో మరింత గుర్తింపు లభిస్తుంది. ఎన్నికల్లో యూపీఏకు మెజారిటీ వచ్చి ప్రధాని పదవిని రాహుల్ అంగీకరించని పక్షంలో తనకే ఆ అవకాశం లభిస్తుంది. గతంలో మన్మోహన్ కూడా ఆర్థికమంత్రిగా ఉండి ప్రధానయ్యారు.
ఇదే సంప్రదాయం తన విషయంలో కూడా నిజం కావాలంటే ముందుగా సోనియా మెప్పు పొందాలని చిదంబరం ఆశించారు. అందుకే ఆమె జన్మదినోత్సవం రోజున విభజన ప్రకటన చేశారు. అలాగే రాష్ట్ర పరిశీలకునిగా నియమితులుకాగానే దిగ్విజయ్ హుటాహుటిన విభజన ప్రక్రియపై ప్రకటన జారీ చేశారు. ఆయన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు ఓటమిపాలైంది. ఇప్పట్లో తిరిగి అధికారంలోకొచ్చే అవకాశంలేదు. దీంతో ఆయనకు రాజకీయ పునరావాసం తప్పనిసరైంది. ఈ దశలో ఆయనేకంగా రాష్ట్రపతి పీఠంపై కన్నేశారు. అది సాధించాలంటే సోనియా ఆశీస్సులు కావాలి. అందుకు ఆమె ఎదుర్కొంటున్న కీలక సమస్య పరిష్కరించాలి. గతంలో ఆయన కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా పని చేశారు. వైఎస్ కాలంలో రాష్ట్రంలో చక్రం తిప్పారు. కొందరు సీనియర్లతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. దీనిని ఉపయోగించుకుని రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని విడదీసేయాలంటూ ఓ నిర్ణయానికొచ్చేశారు. అలా సోనియా తలనొప్పిని మటుమాయం చేసేయాలనుకున్నారు. అంతేతప్ప క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాల్ని గుర్తించలేక పోయారు. ఒక్క షిండే మాత్రమే ఈ విషయంలో దృఢవైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పని చేశారు. ఇక్కడి పరిస్థితులపై ఆయనకు అవగాహనుంది. విభజన ప్రక్రియతో రాష్ట్రంలో కొత్త ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన ముందుగానే కేంద్రాన్ని హెచ్చరించారు. అయినా దిగ్విజయ్, చిదంబరంల వాదనలే సోనియా చెవికెక్కాయి. దీని ఫలితమే రాష్ట్రంలో కార్చిచ్చురగిల్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more