జగన్ కు బెయిల్ వచ్చే తరుణంలో .. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రాయబారం నడుపుతున్నారు. పిల్ల కాంగ్రెస్ అని విమర్శలు చేసిన నాయకులే.. ఇప్పుడు జగన్ తో కలిసిపోవటానికి సిద్దమవుతున్నారు. వీరిపై సీమాంద్ర ఉద్యమం ఎఫెక్ట్ బాగా పడినట్లు తెలుస్తోంది. వైకాపా తెలంగాణను వ్యతిరేకిస్తూ యూ టర్న్ తీసుకుని సమైక్య నినాదం అందుకున్న తర్వాత జగన్ పార్టీతో తమ భవిష్యత్ మారుతుందని భావిస్తున్న నేతలు వైఎస్ జగన్ తో అంతర్గత ఒప్పందాలు చేసుకుని తమ సీట్లను రిజర్వు చేసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉద్దండులైన నాయకులు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లుగా జగన్ మనిషిగా పేరుపడ్డా కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తున్న ఎంపీ సబ్బం హరి జగన్ పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన చంచల్ గూడలో జగన్ ను కలిశారు. సబ్బంతో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జగన్‌తో ములాఖత్ అయ్యేందుకు రాయబారం నెరపుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పటికే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్టీ అధినేత జగన్ మధ్య ఓ అంగీకారం కుదిరింది. ఇదే జిల్లాకు చెందిన టీడిపి నేత తమ్మినేని సీతారాం ఇప్పటికే పార్టీలో చేరారు. మరో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తన అనుచర ఎమ్మెల్యేలతో వైకాపాలో చేరుతున్నారనే వదంతులు వినవస్తున్నాయి. ఇక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు త్వరలో వైకాపాలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. గుంటూరు జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అనాదిగా రాజకీయ ప్రత్యర్ధి అయిన మాజీ ఎంపి బాలశౌరి ఇటీవలే జగన్‌ను కలుసుకుని పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రముఖ నేత, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైకాపాలో చేరి గుంటూరు ఎంపి స్థానానికి పోటీ చేసేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. కాంగ్రెస్ నాయకుల్లో తొందరపడుతున్నారు. ముందుగా వెళ్లిన వారే సీటు రిజర్వ్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకుల్లో రోజు రోజుకి పిల్ల కాంగ్రెస్ లో కలిసే సంఖ్య పెరిగిపోతుంది. తొందరపడి రాష్ట్ర విభజన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తేవటంతో.. కొత్త విమర్శలను కాంగ్రెస్ పార్టీ చవిచూస్తుంది. రాబోయో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదనే విషయం కాంగ్రెస్ నాయకులకు అర్థమైంది. దీంతో పిల్ల కాంగ్రెస్ లో కలిసేందుకు జగన్ తో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ములాఖాత్ అవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more