రాష్ట్ర విభజన అంశంలో మళ్ళీ ఊగిసలాట మొదలైందా ? అంటే తాజా పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తుంది. నిన్న రాత్రి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఆంటోని కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ హై కమాండ్ ప్రతినిది, సోనియా రాజకీయ వ్యవహారాల సలహదారు అహ్మద్ పటేల్ తో విడి విడిగా భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే తెలంగాణ అంశాన్ని మరికొన్ని రోజులు నాన్చుతారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. వీరప్ప మొయిలీ సీమాంధ్ర మంత్రులతో రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం వచ్చే వరకు విభజన ప్రక్రియ ముందుకు పోదని, కేబినెట్ నోట్ వచ్చే అవకాశాలు లేవని ఆయన అన్నట్లు సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. ఇటు అహ్మద్ పటేల్ కూడా రాష్ట్ర విభజనపై వెనక్కి వెళ్లలేము కాని, ఇప్పటికిప్పుడు ముందుకు వెళ్లలేమని అన్నారని అంటున్నారు. ఈ అంశం పై చర్చించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణపై కేబినెట్ పరిశీలన కోసం హోం శాఖ ఇప్పట్లో ఎలాంటి నోట్‌ను సమర్పించే అవకాశం లేదన్న ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇరు ప్రాంతాల వారికి న్యాయం చేస్తామని పటేల్ హామీ ఇచ్చారని, విషయాలన్నింటినీ పార్టీ అధినేత సోనియా గాంధీ దృష్టికి తీసుకెళతానని చెప్పినట్టు సీమాంధ్ర నాయకులు వివరించారు. సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కాని,కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కాని సీమాంద్రలో ఇలా ప్రతిఘటన వస్తుందని ఊహించలేదని అంటున్న మాటలను బట్టి చూస్తే తెలంగాణ నిర్ణయం పై కాంగ్రెస్ అధిష్టానం తొందరపడిందా అనే సందేహాలు వ్యక్తం అవుతుండటం విశేషం. మరి సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more