విభజనకు సంబంధించి సీమాంధ్ర నేతలు ఢిల్లీలో మకాం వేసి పావులు కదిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ కేంద్ర హోం శాఖ కార్యదర్శిని ప్రత్యేకంగా కలిసి క్యాబినెట్ నోట్‌పై ఆరా తీశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను ఆయన ఈ సందర్భంగా హోం శాఖ కార్యదర్శికి వివరించినట్లు సమాచారం. రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల అనేక సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయని, ముఖ్యంగా నీరు, విద్యుత్, ఉపాధి, వనరులు తదితర అంశాలకు సంబంధించి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యా లు చెలరేగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉండాలని, ఈ విషయంలో ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని ఆయన పునరుద్ఘాటించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడినపుడు చంఢీఘడ్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించారని, దీంతో ఈ రెండు రాష్ట్రాలలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆయన గుర్తు చేశారు.
సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు సమ్మెబాట పట్టి నెలరోజులు పూర్తి కావస్తుందని, గత 44 రోజులుగా విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. విభజన విషయంలో ఎలాంటి సమస్యలున్నా కేంద్ర హోంమంత్రి, ఇతర మంత్రులను, పార్టీ పెద్దలను కలిసి తమ వాదన వినిపించుకోవచ్చునని ఆయన హితవు పలికినట్లు సమాచారం. సీమాంధ్రకు చెందిన కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారని, ఈ ప్రతిపాదనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని శైలజానాథ్ చెప్పారు. ఇలా చేస్తే హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు పట్టిన గతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పడుతుందన్నారు. హోం శాఖ కార్యదర్శిని కలిసిన అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని హోం మంత్రిత్వ శాఖ గుర్తించిందని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొన్ని పార్టీల నేతలు తమ పార్టీ అధినాయకత్వంపై తీవ్ర స్థాయిలో వత్తిడి తీసుకు రావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విభజన నిర్ణయం ఉపకరిస్తుందన్న సంకేతాలను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లుగా బోధపడిందని శైలజానాథ్ చెప్పారు. సోనియా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారని, ఇప్పటికే గూడఛారి వర్గాలు ఇక్కడ జరుగుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వానికి పంపారని ఆయన స్పష్టం చేశారు. విభజన నిర్ణయం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. శైలజానాథ్‌తో పాటు శాసనమండలిలో ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు, సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావులు హోం శాఖ కార్యదర్శిని కలిసిన వారిలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more