పది జిల్లాలలో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన యూపీఏ ప్రభుత్వం ఎవరి మాట వినకుండా తనపని తాను చేసుకుపోతుంది. గత నెల రోజులకు పైగా సీమాంధ్రలో ఉద్యమాలు చేస్తున్నా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాధ్రనాయకులు పట్టుబడుతున్నా వాటికి ఏమాత్రం తలొగ్గకుండా ‘ఇక మాటల్లేవ్... చేతలే ’ అంటూ ఆ పక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్ నోట్ రూపకల్పన మొదలుపెట్టిన కేంద్ర హోంశాఖ... దానికి సంబంధించిన ఒక ఒక కాపీని న్యాయశాఖకు కూడా పంపినట్లు ఢిల్లీ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ ను యూటీగా చేస్తున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు కూడా ఈ నోట్ లో ఏమాత్రం తావివ్వలేదని తెలుస్తుంది. ‘మాట తప్పం... మడమ తిప్పం ’ అనే విధంగా కేంద్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ ప్రక్రియ ఏర్పాటును మూడు నెలల్లో పూర్తి చేయడానికి నడుబిగించింది. ఏ మాత్రం రాష్ట్ర ఏర్పాటు జాప్యం అయినా శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో ఈ ఏడాది చివరి కల్లా రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఢిల్లీలోని ఉన్నత వర్గాల నుండి అందుతున్న సమాచారం. న్యాయ శాఖకు పంపిన నోట్ లో యూటీ ప్రస్తావన తేకుండా కేవలం నదీ జలాల పంపిణీ, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, మూడు ప్రాంతాల్లో నివసించే వారందరి భధ్రత, పౌరులందరికీ ప్రాథమిక హక్కుల హామీ తదితర అంశాలను మాత్రమే ప్రస్తావించినట్లు సమాచారం
గత రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో పాటు, సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు.. పదేపదే ఢిల్లీకి రావటం మానుకుని సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేయటంపై దృష్టిపెట్టాలని అధిష్టానం పెద్దలు నిర్దేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏర్పాటు విషయంలో రాష్ట్రం నుండి ఏమైనా అడ్డంకులు ఏర్పడితే.... ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సిద్దపడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి సీమాంధ్రులు చేస్తున్న ఆందోళనలు, వారు సమైక్య రాష్ట్రం పై పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయినట్లే భావించాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more