ఒకే జెండా, ఒకే పార్టీ.. ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. అయిన వీరు కలుసుకోరు-మాట్లాడుకోరు ..కానీ పదవులు మాత్రం కావాలి. ఈ ముగ్గురు మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరు జై సమైక్యం అంటే మరొకరు జై తెలంగాణ అంటారు. ఇంకోకాయన జై సీమాంద్ర అంటారు. ఈ ముగ్గురు దారులు వేరైన ఉన్నది మాత్రం ఒకే రాష్ట్రంలోనే. ఇప్పుడు ఈ ముగ్గురుకి ఒక రాయబారి కావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకోలేని రీతిలో వారి మధ్య అగాధం ఏర్పడిందని ఆ పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారు. అధిష్ఠానం ఈ పరిణామాలను గమనించి ఈ ముగ్గురి మధ్య సఖ్యత కుదిరిస్తే తప్ప పరిస్థితులు చక్కబడవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్న అనంతరం రాష్ట్రంలో కొన్ని నూతన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యుపిఎ సమన్వయ కమిటీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మానాలు చేసినప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సారధిగా ఉన్న బొత్స సత్యనారాయణ, ప్రభుత్వానికి సారధిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖాముఖిగా ఇప్పటివరకు కలుసుకున్న దాఖలాలు లేవు. ఉప ముఖ్యమంత్రి మాత్రం మౌనంలో ఉన్నారు. ప్రస్తుత కీలక తరుణంలో పార్టీ, ప్రభుత్వ సారధుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల భవిష్యత్‌లో పార్టీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందనే ఆందోళన కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉండగా, ఈ ముగ్గురు ఎడమొఖం, పెడమొఖంగా వ్యవహరిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన, ప్రభుత్వ పదవిలో ఉన్న ఒక నాయకుడు వీరి మధ్య వారధిగా(రాయభారిగా) సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు అనుమతితోనే ఈ నాయకుడు ఇద్దరి అభిప్రాయాలను ఒకరికొకరికి చేరుస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఒకవైపు అధికారం కోసం పోటీ పడుతున్న పార్టీలు ప్రజల్లోకి వెళ్ళి వారి మద్దతును కూడగట్టేందుకు, కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, అధికారం ఉండి కూడా ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోలేక పోతున్నామనే ఆవేదన కూడా పలువురిలో నెలకొంది. బొత్స, కిరణ్, రాజనరసింహల మధ్య సఖ్యత, సమన్వయం లేకపోవడమే కాకుండా సమయం దొరికితే ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారనే వాదనలు కూడా వినవస్తున్నాయి. ఈ ముగ్గురు ఎప్పుడు కలుసుకుంటారో, ఎప్పుడు మాట్లాడుకుంటారో. ఎప్పుడు రాష్ట్రం ప్రజల గురించి ఆలోచిస్తారో అంత ఆ పెరుమళ్ళకే తెలియాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more