తెలంగాణవాదులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహారిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడిని నిరసిస్తూ ఈరోజు విద్యుత్ సౌథ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొడుతుందని అన్నారు. ఆ ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హరీష్ రావు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ తదితరులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం వారు విద్యుత్ సౌథలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
రక్షణ కావాల్సింది మీకా?మాకా? హరీష్‌రావు
నగరంలో రక్షణ కావాల్సింది తెలంగాణ వారికా? సీమాంధ్రులకా? అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. నెల్లూరులో తెలంగాణకు చెందిన ఓ జిల్లా అధికారిపై సీమాంధ్రులు దాడి చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ నర్సు శిక్షణ కోసం వెళితే వెనక్కి పంపించారు. విద్యార్థులను అడ్డుకుంటున్నారు. తెలంగాణ ఉద్యోగులు గన్‌మెన్లను పెట్టుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు సీమాంధ్రలో ఉన్నాయి. మరలాంటప్పుడు రక్షణ కావాల్సింది సీమాంధ్రులకా? తెలంగాణ వారికా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క సీమాంధ్ర ఉద్యోగిపైన దాడి జరిగిందా అని అడిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more