ఈ రోజు తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో జరిగే మనగుడి కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా వస్తారని ఆశించారు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం దానికి తూట్లు పొడిచింది, ఆలయ ఆదాయానికీ గండిపడింది. ముందుగా అనుకున్నారు కనుక కార్యక్రమాన్నైతే ప్రారంభించారు కానీ అది గుడిలో కాక బడిలో జరిగింది. పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో మనగుడి కార్యక్రమాన్ని ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎమ్ జి గోపాల్ కళాశాలలోని ఆలయంలో రక్షాకంకణాలకు పూజలు నిర్వహించి వాటిని విద్యార్థినులలో పంపిణీ చేసారు.
ఒడి, బడి, గుడి- అన్నిట్లోనూ మనిషి తన జీవితంలో అవసరమైనవి పొందుతాడు. వీటిలో గుడి మొక్కుబడి అయింది.
తల్లి ఒడిలోకి వచ్చిన మనిషి మమకారం, ప్రేమ, ముద్దు ముద్దు మాటలు నేర్చుకుని, లేచి నిలబడటం జరుగుతుంది. బడిలో ఓనమాలతో మొదలై బ్రతుకుతెరువుకు కావలసిన విద్యను అభ్యసించటం జరుగుతుంది. ఇక గుడిలో ఆధ్యాత్మిక ఎత్తులను అధిరోహించటం జరిగి బ్రతుకు తెరువు కాదు, అసలు బ్రతుకంటే ఏమిటో తెలుసుకోవటం జరుగుతుంది.
కానీ గుడికి మనం ఇచ్చేది చిట్టచివరి ప్రాధాన్యత. చెయ్యవలసిన పనులు ఎక్కువైపోయి సమయం వాటన్నిటికీ సరిపోనప్పుడే కొన్ని పనులు ప్రాధాన్యతలను సంతరించుకుంటాయి, కొన్ని చేసుకోవు. అలా ప్రాధాన్యతలలో చివర్లో నిలబడేది గుడి. జీవితంలో ఏదైనా కోరుకోవటానికి, లేదా ఆటవిడుపు కోసం గుడులకు వెళ్ళేవారే ఎక్కువమందైపోయారు. అందుకే గుడికి పోవటం మొక్కుబడి అయింది. మొక్కుబడి అన్నది నిజానికి మనం దేవుడికి ఇది చేస్తాను అని మొక్కుకుని చేసే పని. కానీ కాలక్రమంలో మొక్కుబడి అంటే యాంత్రికంగా చెయ్యటం అనే అర్థం వచ్చింది ఎందుకంటే మనలో చాలా మంది గుడిలో కానీ ఇంట్లో కానీ పూజ చేసేది యాంత్రికంగానే కనుక. అందుకే యాంత్రికంగా, అనాలోచితంగా, శ్రద్ధ చూపకుండా, చెయ్యాలి కాబట్టి చేసాం, అని చేసే పనికి మొక్కుబడిగా చెయ్యటం అనే అర్థం వచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానముల చేత ఏర్పాటు చెయ్యబడ్డ ధర్మ ప్రచార పరిషత్, ధర్మాదాయ దేవాదాయ శాఖ వారితో కలిసి రచించిన మనగుడికి నుడికారం జరిగింది ఆగస్ట్ 11 న అది ఈ రోజు శ్రావణ పౌర్ణమితో అంతమవుతోంది.
భక్తుల సమక్షంలో ఘనంగా జరగవలసిన గుడిలోని పారిశుద్ధ్య కార్యక్రమం జరగలేదు కాబట్టి ఈ రోజు తిరుపతిలో జరిగిన మనగుడి కార్యక్రమం కూడా మొక్కుబడిగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యలో రాష్ట్రంలో అనేక ఆలయాల్లో జరిగిన మనగుడి కార్యక్రమం మాత్రం విజయవంతమయ్యాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more