ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కి తెరలేచింది. స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల వసూళ్లు సాధిస్తేనే ఆ సినిమా హిట్ అనే పరిస్ధితి. ఇటీవల కాలంలో చాలా మంది హీరోల సినిమాలే 100 కోట్ల క్లబ్బులో చేరాయి. మొన్నటికి మొన్న మిల్కాసింగ్ జీవితం ఆధారంగా తీసిన ‘బాగ్ మిల్కా భాగ్ ’ సినిమా కూడా వందకోట్లు దాటింది. అంతకు ముందు వచ్చిన ‘హే జవానీ హైదివానీ ’ సినిమా కూడా మొదటి వారంలోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేసి పెట్టింది. కానీ షారూఖ్ ఖాన్ - దీపిక పడుకునే జంటగా నటించిన ‘చెన్నయ్ ఎక్స్ ప్రెస్ ’ సినిమా విడుదల అయిన మూడు రోజులకే 100 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రంజాన్ సందర్భంగా ఆగస్టు తొమ్మిదో తేదీ శుక్రవారం నాడు విడుదలైన చెన్నై ఎక్స్ప్రెస్ కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్లు సంపాదించింది. గురువారం నాటి ప్రివ్యూల నుంచి 6.75 కోట్లు, శుక్రవారం విడుదల రోజున 33.12 కోట్లు, శనివారం రెండో రోజు 28.05 కోట్లు, ఆదివారం 32.50 కోట్లు వసూలు చేసింది. మొత్తం 100.42 కోట్ల నెట్ వసూళ్లు జరిగినట్లు ఆ చిత్ర నిర్మాతలు తెలిపారు.
100 కోట్లు వసూలు చేసే సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో దీపికా పదుకొనే అచ్చమైన తమిళ పొణ్నులా చీరకట్టు కట్ట, షారూఖ్ ఖాన్ తో చేసిన కెమిస్ట్రీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా నిర్మాణ వ్యయం 70 కోట్ల రూపాయలు. మూడు రోజుల్లో నిర్మాణ వ్యయాన్ని దాటి ఎక్కడికో వెళ్లిపోవడంతో నిర్మాతలు తెగ ఆనందంతో ఉన్నారు. విడుదల రోజే ఈ సినిమా మొదటి వారంలోనే రికార్డులు బద్దలు కొడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. అంచనాలను ఈ సినిమా మించింది. తమిళనాడుకు చెందిన ఓ డాన్ కుమార్తెతో ప్రేమలో పడే ఉత్తరాది కుర్రాడి కథతో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటోంది. కేవలం మన దేశంలోనే కాక, విదేశాల్లో కూడా దాని వసూళ్లు అదరగొడున్నాయి. యూటీవీ సంస్ధ, రెడ్ చిల్లీస్ సంస్ధ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. చాలా రోజుల తరువాత షారూఖ్ ఖాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తెగ హ్యాపీ ఫీలవుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more