మార్స్ ఒన్ ప్రోగ్రాం లో ఒక వైపు యాత్రకు లక్షమంది అర్జీలు పెట్టుకున్నారని నాసా తెలియజేసింది.
అంగారక గ్రహానికి పోవటం వరకే కానీ తిరిగి రారు. అక్కడే నివాసముంటారు. ఇదీ ప్రోగ్రాం. ఇది 2022 లో జరుగుతుంది కాబట్టి ముందస్తుగా బుకింగ్ లు జరిగగా లక్షమంది ఇప్పటికే సిద్ధమయ్యారూ అంటే వాళ్ళకి భూమ్మీది జీవనం ఎంత రోత పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు. సాహస యాత్రగా కొందరు తీసుకుంటే ఇక్కడి నుంచి పోతే అంతే చాలని కొందరు అనుకుంటూ గ్రహాంతర యాత్రకు రిజర్వేషన్ చేసుకుంటున్నారు.
వివిధ దేశాలకు చెందిన 40 మంది సెప్టెంబర్ 2022 లో అరుణ గ్రహం వైపు అడుగులు వేస్తారు. వాళ్ళు 2023 ఏప్రిల్ లో అంగారకుడి మీద పాదం మోపుతారు. మరో రెండు సంవత్సరాల తర్వాత మరో నలుగురు వెళ్తారు కానీ వీరిలో ఎవరూ భూమ్మీదికి తిరిగి రారు. అక్కడే ఉండిపోతారు. అక్కడ కాలనీ నిర్మాణం జరుగుతుంది. అందులో వీరంతా కాపురాలు చేస్తారు. అయితే ఈ ప్రోగ్రాం ఆషామాషీదేం కాదు. 6 బిలియన్ డాలర్ల ఖర్చుతో పూర్తవుతుందని అంచనా. ఎనిమిది సంవత్సారాల కాలం గ్రహాంతర యాత్రికులకు శిక్షణ ఉంటుంది. అయినా రేడియేషన్ పరిస్థితుల దృష్ట్యా 500 రోజులకంటే ఎక్కువ కాలం బ్రతకటం కష్టమని కూడా చెప్తున్నారు.
నాసా డెప్యూటీ డైరెక్టర్ క్రిస్ మూరే రేడియేషన్ కాదు కానీ అసలు గ్రహాంతర ప్రయాణమే ప్రమాదభరితమైనది కాబట్టి స్పేస్ క్రాఫ్ట్ ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మించాలని ఇంజినీర్లకు ఆదేశాలిచ్చారట.
లక్షమందిలో 44 మందికి మాత్రమే ఈ ప్రోగ్రాంలో చోటు దొరకబోతోంది. అయితే శిక్షణా కాలంలోనూ, పూర్తయిన తర్వాత ఎంత మంది ఉత్సాహం చూపిస్తారు, టికెట్ ఖరీదింకా నిర్ణయించలేదు. మిలియన్లలో ఉండే అంత పెద్ద మొత్తాన్ని ఎందరు భరించి ఈ సాహసయాత్రకు వెళ్తారన్నది వేచి చూడవలసిందే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more