శింబు, హన్సికలు కలిసి తిరుగుతున్నారంటూ లోకమంతా కోడైకూసి అలసిపోయి మానేసిన తర్వాత, ఔను మేము ప్రేమించుకుంటున్నాం అని ప్రకటించేసారు.
చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా ఒక్కోసారి ఏది ముందు జరిగిందో అర్థం కాదు. వాళ్ళు ప్రేమించుకుంటున్నారని పసిగట్టిన మీడియా ముందుగానే రచ్చరచ్చ చేసేసిందా లేకపోతే మీడియా ప్రచారాలు చూసి, ఇదేదో బాగున్నట్టుందే అని అనుకున్నారా అన్నది తెలియదు కానీ, శింబు హన్సికలిద్దరూ విడివిడిగా వారి వారి ట్విట్టర్లలో తమ ప్రేమ విషయాన్ని ధృవీకరించారు.
వాలు, వెట్టై మన్నమ్ తమిళ సినిమాల్లో నటిస్తూ నటిస్తూ చివరకు ఆ నటనలో జీవిస్తే ఇంకా బాగుంటుందనుకున్నారేమో లేకపోతే మీడియా ప్రచారాలకు చెక్ పెట్టటానికి కూడా ఆ ప్రకటన చేసుండవచ్చు. ఎందుకంటే, ప్రేమించేది మేమే కానీ పెళ్ళి విషయం మా పెద్దలు చూసుకుంటారని- అంటే మా పని మేము చేసుకుంటాం పెద్దల పని వాళ్ళు చూసుకుంటారంటూ గడుసుగా తప్పించుకుంటూనే, ఇది ఇక మా ప్రైవేటు విషయం కాబట్టి దీని మీద కవరేజ్ లు మానెయ్యండంటూ మీడియాను అభ్యర్థించారు ఇద్దరూ.
ఈ ఆఖరి విజ్ఞప్తే కొద్దిగా అనుమానాలకు దారితీస్తోంది. ఏది ఏమైనా హన్సిక మాత్రం చిన్న కుష్బు అని పిలిపించుకుంటూ తమిళంలో బాగానే పాతుకుపోయింది. జ్యోతిక లా వివాహబంధంలోకి వెళ్ళిపోదామని సీరియస్ గా అనుకుంటున్నదేమో కూడా తెలియదు.
విచిత్రమేమిటంటే వాళ్ళిద్దరూ ఛీ పాడు అటువంటిదేమీ లేదు అన్నప్పుడేమో లేదు ఏదో ఉంది వాళ్ళ మధ్యన అనే అనుమానం కలిగింది అందరికీ. ఇప్పుడు ఔను మేమిద్దరం ఇష్టపడ్డాం, పెళ్ళి కూడా చేసుకుంటాం అన్నప్పుడేమో కాదేమే అని అనుమానపడేవాళ్ళు తయారయ్యారు. దీన్నే లోకం పోకడ అంటారేమో.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more