Aimim leader asaduddin owaisi against telangana

AIMIM leader Asaduddin Owaisi, Asaduddin against Telangana, Congress plan flayed by AIMIM, AIMIM not to support Congress, AIMIM for United AP State

AIMIM leader Asaduddin Owaisi against Telangana

ప్రత్యేక తెలంగాణ వద్దేవద్దు

Posted: 07/21/2013 09:35 AM IST
Aimim leader asaduddin owaisi against telangana

ఆలిండియా మజ్లీస్ ఎ ఇత్తెహదుల్ ముస్లీమీన్ (AIMIM) తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తోంది.  రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యటాన్ని మేము సమర్థించమంటూ ఆ పార్టీ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసి ప్రకటన చేసారు.  ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధాలూ లేవని స్పష్టం కూడా చేసారాయన.  హైద్రాబాద్ ని ఉమ్మడి రాజధానిగా చెయ్యటం, లేక కేంద్రపాలిత నగరంగా ప్రకటించటం లాంటి మాటలు వినిపిస్తున్న సందర్భంలో వాటిని కూడా సమర్ధించబోమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. 

తమ పార్టీ మొదటినుంచి సమైక్యరాష్ట్రానికే మద్దతునిచ్చిందని, ఇప్పుడేదో రాజకీయ ఫలాలకోసం రాష్ట్రాన్ని విభజించటానికి చూస్తే కాంగ్రెస్ కి అందులో మద్దతునిచ్చేది లేదని ఒవైసీ అన్నారు.  రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా నినాదంతో ముందుకొస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలను అడ్డుకోవటం కోసమే కాంగ్రెస్ ఇప్పుడు తనంతట తాను తెలంగాణా రాష్ట్రాన్ని ఇస్తున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తోందని, తెలంగాణా వస్తే భాజపా పుంజుకోవటం మాత్రం ఖాయమని, తమ పార్టీ కాంగ్రెస్ కి మద్దతునివ్వటం కాదు అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదన్నారాయన.

ఇలాంటి రాజకీయ ఎత్తుగడలకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టి రాష్ట్రంలో మతసామరస్యానికి పాటుపడితే మంచిదని అసదుద్దీన్ సూచించారు. 

హైద్రాబాద్ నగరం తెలంగాణా జిల్లాలతో చుట్టుముట్టి ఉంది కాబట్టి ఉమ్మడి రాజధాని అనేది కూడా సరైన ఆలోచన కాదని, సీమాంధ్రులు హైద్రాబాద్ లోకి అడుగుపెట్టాలంటే తెలంగాణా జిల్లాల మీదుగా రావలసివుంటుందని అసదుద్దీన్ ఒవైసి తన అభిప్రాయాన్ని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more