ముక్కోణపు సిరీస్ కోసం మంచి ఫాంతో విండీస్ లో అడుగుపెట్టిన ధోని సేనకు ఊహించని షాక్ లు తగిలాయి. మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడంతో ఇలా ఆడితే ఫైనల్ కి రావడం కష్టమే అన్నారంతా. కానీ ఆ ఓటములను మరిపించే విధంగా తరువాతి రెండు మ్యాచ్ ల్లో అద్బుత విజయాలను సాధించడమే కాకుండా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి మరో కప్ సాధించేందుకు ఆడుగు దూరంలో నిలిచింది. ఇక గత కొన్ని సిరీస్ ల నుండి ఫైనల్లో శ్రీలంక జట్టే మనకు ప్రత్యర్థి జట్టుగా ఉంటుంది. ఇప్పటికే ఆ జట్టు పై పలు విజయాలు సాధించిన టీం ఇండియా ఆటగాళ్లు ఈ సిరీస్ లోకూడా అన్ని విభాగాల్లో అదరగొడుతున్నారు. ఈ ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్ కి నేటి సాయంత్రమే ముహూర్తం.
ఇక రెండు జట్ల బలా బలాల విషయానికి వస్తే.... రెండు మ్యాచ్‌ల్లో వరుసగా బోనస్ పాయింట్లతో ఘన విజయాలు సాధించిన భారత్... ఫైనల్లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు శ్రీలంక జట్టు చాలాకాలంగా భారత్‌ను నాకౌట్ దశలో ఎప్పుడూ ఓడించలేదు. ఈసారి ఈ లోటు తీర్చుకోవాలని మాథ్యూస్ సేన భావిస్తోంది. శ్రీలంక జట్టు భారమంతా సీనియర్ ఆటగాళ్ళు జయవర్థనే, సంగక్కర పైనే ఉంటుంది. ఇప్పటికే భారత్ పై మంచి రికార్డులు ఉన్న వీరు ఎలా ఆడతారన్నది గెలుపోటముల మీద ఆధారపడి ఉన్నాయి.
భారత్ విషయానికి వస్తే... గత మ్యాచ్ ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించవచ్చు. ధావన్, రోహిత్ రూపంలో చక్కటి ఓపెనింగ్‌తో పాటు కోహ్లి, రైనా, కార్తీక్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. గాయంతో రెండు మ్యాచ్ లకు దూరం అయిన ధోని మళ్లీ జట్టులోకి రావడం మంచి పరిణామం. ఒకవేళ ఈ మ్యాచ్ లో ధోని ఆడితే మురళి విజయ్ బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది. ఇక బౌలింగ్ లో కుర్రాళ్ళ ప్రదర్శన ఎంతో సంతోషాన్నిస్తోంది. చివరి మ్యాచ్‌లో లంకను కుప్పకూల్చిన భువనేశ్వర్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఉమేశ్, ఇషాంత్‌లు కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ఆల్‌రౌండర్‌గా జడేజా పూర్తి స్థాయిలో తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత్‌నుంచి మరో మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చు.
పిచ్ విషయానికి వస్తే... పిచ్ పై తేమ ఎక్కువగా ఉంటుంది. పరుగులు వేగంగా చేయలేకపోతారు. ఈ పిచ్ పై మరోసారి తక్కువ స్కోర్లే నమోదయ్యే అవకాశం ఉంది. చివరి మ్యాచ్ లాగే ఈ మ్యాచ్ కి వరణుడు అడ్డంకిగా ఉండే అవకాశం ఉంది. రెండు జట్ల మధ్య జరిగిన గత 13 మ్యాచ్ ల్లో భారత్ 9 విజయాలను సాధించగా... శ్రీలంక మూడు నెగ్గింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more