Botsa satyanarayana road map

Botsa satyanarayana road map, telangana issue, botsa satyanarayana pcc chief, sonia ganghi congress president, digvijay singh aicc secreatery, kavuri sambhasivarao, andhra ministers,

Botsa satyanarayana road map

బొత్స రోడ్‌మ్యాప్ కసరత్తు

Posted: 07/06/2013 09:24 PM IST
Botsa satyanarayana road map

కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ తెలంగాణ ఏర్పాటు పై రోడ్డు మ్యాప్ రెడీ చెయ్యండని .. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకు అప్పగించారు. ఎంత త్వరగా రోడ్డు మ్యాప్ ఇస్తే అంత త్వరగా తెలంగాణ పై నిర్ణయం ప్రకటిస్తాం అని దిగ్గిరాజు చెప్పటం జరిగింది. తెలంగాణపై రోడ్ మ్యాప్ కసరత్తులో బొత్స మునిగిపోయారు. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీకి చేరుకున్నట్లు అర్థమవుతోంది. ఆయన పలు దఫాలుగా సీమాంధ్రకు చెందిన పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ తయారు చేయాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలకు సూచించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావుతో బొత్స సత్యనారాయణ దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కావూరి సాంబశివరావు గతంలో సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమస్యపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కావూరి సాంబశివరావు చెప్పారు. ఈ స్థితిలో బొత్సకు, కావూరికి మధ్య జరిగిన చర్చల వివరాలు తెలియడం లేదు. కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడి శీలంతో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో అరగంట పాటు మాట్లాడారు. కొంత మంది సీనియర్ పార్లమెంటు సభ్యులతో కూడా ఆయన సమావేశమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more