ప్రస్తుతం భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విజయాలలో కుర్రాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళు రాణించడంతో భారత జట్టు సెలక్షన్ కమిటీ సీనియర్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు సమిష్టిగా రాణించడంతో విండీస్ టూరుకు ఏ మార్పులు చేర్పులు లేకుండా అదే జట్టును విండీస్ పంపించింది. దీంతో సీనియర్ ఆటగాళ్ళు అయిన సెహ్వాగ్, గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్, హర్జన్ సింగ్ లాంటివాళ్లు మళ్ళీ జట్టులోకి వస్తారా ? వస్తామనే ఆశలను కూడా వారు వదుకోవాల్సిందేనని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీం ఇండియా పరాజయాల పాలైనప్పుడు సీనియర్లు రాణించకపోవడమే కారణం అనే వాదన బలంగా వినబడింది. దీంతో భారత క్రికెట్ నియంత్రన మండలి చర్యలు చేపట్టాలని చాలా మంది సూచించారు. కానీ సెలక్టర్లు సీనియర్ ఆటగాళ్ళకే అండగా నిలిచి వారిని తప్పించే సాహసం చేయలేక పోవడంతో స్వదేశంలో, విదేశీ గడ్డ పై వైఫల్యాలు చెందారు. దీంతో కెప్టెన్ జట్టుకు సమర్థవంతమైన ఆటగాళ్లను ఇవ్వాలని ప్రతిపాదించాడు. సరైన జట్టును ఇస్తే అద్భుతాలు చేస్తామని చెప్పాడు. అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ శ్రీకాంత్ తప్పుకున్న తరువాత బాధ్యతలు చేపట్టిన సందీప్ పాటిల్ చొరవ చూపి సీనియర్ ఆటగాళ్లను, ఫాంలేని వాళ్ళను తప్పించి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చాడు. ఈయన పకడ్బందీగా జట్టును కూర్చడంతో వరుస విజయాలతో దూసుకుపోతుంది.
దీంతో బీసీసీఐ వారు కూడా జట్టు సభ్యుల విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. సందీప్ పాటిల్ కఠిన నిర్ణయాల ముందు సచిన్ లాంటి వాళ్ళు కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటి నుండో సీనియర్ ఆటగాళ్ల మీద ఆధార పడ్డ జట్టుకు యువరక్తాన్ని అందించి జట్టును గాడిలో పెట్టిన ఘనత పాటిల్ కి దక్కుతుందనడంలో ఏటువంటి అభ్యంతరం లేదు. ఇక జట్టులో స్థానం కోల్పోయిన గంభీర్ ని ఛాంపియన్స్ ట్రోఫి నుండి వేటు వేశారు, ఇక వరుసగా విఫలం అయిన సెహ్వాగ్ కూడా జట్టులోకి రావాలని ప్రయత్నిస్తున్నా అది కుదిరేలా లేదు. ఇక కొత్తగా జట్టులోకి వచ్చిన ధావన్, జడేజాలు అద్బుతంగా రాణిస్తున్నారు. ఇక సీనియర్ ఆటగాడు అయిన రోహిత్ శర్మ కూడా ఓపెనింగ్ లో అదర గొడుతున్నారు. బౌలర్లలో భువనేశ్వర్, యాదవ్ చక్కటి బంతులు విసరడంతో జహీర్ కూడా అవకాశాలు కనుమరుగు అయినట్లే. జడేజా బౌలింగులో , బ్యాటింగులో రాణిస్తుండటంతో హర్భజన్ కూడా జట్టులోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ముందు ముందు వారు దేశవాళీ, కౌంటీల్లో, రంజీల్లో బాగా రాణించి, యువకులు ఫాం కోల్పోతే తప్ప వీరు జట్టులోకి వచ్చే అవకాశాలు లేవు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more