దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లను వీడదీసి చూస్తే అసలు విషయం అందరికి తెలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. అంతేకాకుండా తెలంగాణ వాదులకు ఒక శుభవార్త కూడా చెప్పాడు. ఆయన ఈరోజు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాల్లో తేడా ఉందని వ్యాఖ్యానించారు. వైయస్ ఓపిగ్గా రాజకీయాలు చేసేవారని, జగన్ మాత్రం ఉండలేకపోయారన్నారు. రాజకీయాల్లో ఆవేశం పనికిరాదని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. జగన్ పార్టీలోను కాంగ్రెసు డిఎన్ఏ ఉందన్నారు. వైయస్ వేరు, జగన్ వేరు అన్నారు. వైయస్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వారు వ్యాపారాలు మానుకోవాలని సూచించారు. మనం ఐక్యంగా ఉంటే పార్టీని ఎవరూ ఓడించలేరన్నారు. కార్యకర్తలు అంతా కాంగ్రెసును తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు.
వారం రోజుల్లో కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశమవుతుందని, అప్పుడు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో అన్నారు. గత నెలాఖరులోగా తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఓ నిర్ణయం ప్రకటిస్తుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో భేటీ కానున్న కోర్ కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుందని దిగ్విజయ్ చెప్పడం గమనార్హం. వారం పదిరోజుల్లో తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటే... ఇరు ప్రాంత నేతలు దానికి కట్టుబడి ఉంటాలని ఆయన సూచించారు. అన్నీ ఆలోచించే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వారం అంటే ఎన్నీ రోజులో కూడా చెబితే బాగుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంటే గతంలో వారం, ఏడు రోజులు కాదు, నెల అంటే 30 రోజులు కాదు అనే మాటలు కాంగ్రెస్ నాయకుల నోటి నుండి రాలిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు తెలంగాణ పై వారం రోజులు అనటంతో తెలంగాణ నాయకులు భయపడిపోతున్నారు. వారం రోజుల్లో తెలంగాణ సమస్యను డిగ్గీ ఎలా పరిష్కారిస్తారో చూద్దాం...
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more