ఆయన జైలు కు వెళ్లి సరిగ్గా ఏడాది కావస్తోంది. అప్పటినుంచి జైలే ఇల్లయ్యింది. నాలుగు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అన్ని పర్యాయాలు ఆయనకు న్యాయస్థానాల్లో చుక్కెదురైంది.ఆయనే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. సరిగ్గా ఏడాది కిందట అంటే 2012 మే 24. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రాష్ట్రం సంచలనం రేగింది. మాజీ మంత్రి మోపిదేవిని పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసులో నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారన్న అభియోగాలు వెల్లువెత్తిన నేపథ్యంలో మోపిదేవి అరెస్టుకు ముందే మంత్రి పదవికి రాజీనామా చేశారు. వరుస పరిణామాల తరువాత ఆయనను సీబీఐ కోర్టుకు తరలించారు. తదనంతరం ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు ఆంక్షలు విధిస్తూ ఏడు రోజుల సీబీఐ కస్టడీకి ఆయనను అప్పగించింది. కస్టడీ ముగిసిన అనంతరం చంచల్ గూడ జైలు కు వెళ్లారు. అక్కడ జైలు అధికారులు ఆయనను అండర్ ట్రైల్ ఖైదీ గా గుర్తిస్తూ , 6113 నంబర్‌ను కేటాయించారు.
వివాదానికి కారణమిది
మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వాన్ పిక్ కు 1300 ఎకరాలను కట్టబెట్టిన కారణంగా ఆయన వైఖరి వివాదాస్పదమైంది. బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించారని సీబీఐ ఆధారాలు సేకరించింది. నాటి ముఖ్యమంత్రి వైస్సార్ ఇలాఖాలో క్విడ్ ప్రోకో విధానంలో భాగంగా మోపిదేవి ఉదారతను పాటించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాయితీల పేరుతో వాన్ పిక్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ కు ఆయన లబ్ధి చేకూర్చారని పేర్కొంటూ సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. దీంతో మోపిదేవి జైలు బాట పట్టారు.
ఇక తనను సాధారణ ఖైదీలా కాకుండా'ప్రత్యేకం'గా ట్రీట్ చేయాలని మోపిదేవి న్యాయస్థానాన్ని వేడుకున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు వీఐపీల బ్యారక్ లో రూం కేటాయించింది. అప్పటి నుంచి మోపిదేవి స్పెషల్ లైఫ్ గడుపుతున్నారు.ఇప్పటికే రెండు సార్లు సీబీఐ కోర్టులో, మరో రెండు సార్లు హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ కోర్టులు ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చాయి.
ఆయన డై(లీ)రీ లైఫ్
ఉదయం 5.30కు నిద్రలేస్తారు.
ఆరు నుంచి ఏడున్నర వరకు జగన్, నిమ్మగడ్డ, గాలి జనార్దన రెడ్డి అండ్ కో తో షటిల్ ఆడుతారు.
మోపిదేవితో సహా ఇతర ప్రముఖులంతా ఒకే చోట వంట చేయించుకుంటున్నారు.
లేదా ఇంటి దగ్గర నుంచి భోజనం తెప్పించుకుంటున్నారు.
ఇలా అన్ని సదుపాయాలతో ఆయన జైలు జీవితం ప్రశాంతంగా సాగుతోంది.
మొదట్లో తన నియోజకవర్గం కార్యకర్తలతో ముచ్చటించినా, ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యులతో మాత్రమే భేటీ అవుతున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more