రాజకీయ నాయకులు ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి విమర్శలు చేస్తారో ఊహించటం చాలా కష్టం. కానీ వారి చేసే విమర్శలు చూస్తే మాత్రం నిజంగా అలా చేస్తారా అనిపించే విధంగా ఉంటాయి. దూరంగా ఉండి మైకుల ముందు తిట్టుకుంటారు. కంటికి కనిపిస్తే మాత్రం .. కౌగిలింతలు.. ఐ లవ్ యులు చెప్పుకుంటూ.. ఒకరి చేతులో ఒకరు చెయ్యి వేసి ఉసులాకుంటారు మన రాజకీయ నాయకులు. ఆ సమయంలో మీడియా మైకు కనిపిస్తే.. చాలు .. ఇక కాకి కూతులుతో మీడియాకు నవరసాలు కరిపిస్తారు.
నిన్న చంద్రబాబు , లోకేష్ , ఆనం రామనారాయణ రెడ్డి లు ఒకే రోజు వైసీపీ పార్టీని, పార్టీలో నాయకులను , జైల్లో ఉన్న వైఎస్ జగనను పుల్ గా కడిగిపాడేశారు. అసలే సమ్మర్ వీరు కడిగిన తీరుకు హుస్సేన్ సాగర్ సైతం ఆ కంపు నీటిని వెనక్కి తన్నింది. అంటే ఈ నాయకులు తమ నాలుకలు బయట పెట్టి ఆ రకంగా వైసీపీ నాయకులు కడిగిపాడేశారన్నామట. అయితే ఈ ముగ్గురి నాలుకలు కోయ్యాటానికి వైసీపీ నుండి ఒక సీనియర్ నాయకుడు రంగంలోకి దిగాడు. నిన్నటి సమావేశంలో కాంగ్రెస్ నేతలు, సీఎం సొంత డబ్బా బాగా మోగించుకున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఒక్కమాట అనలేదని, ప్రజాపక్షంగా ఉన్న వైఎస్ఆర్ సీపీపై మాత్రం పనిగట్టుకుని విమర్శలు చేశారని తెలిపారు.
వైఎస్ఆర్ రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వందశాతం ఎల్లో మీడియా చంద్రబాబు భజన చేస్తోందని, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే సాక్షి పత్రిక పుట్టిందని తెలిపారు. 4 ఏళ్లలో సీఎం, బొత్సలకు వార్తా చానళ్లు కొనేంత డబ్బులు ఎలా వచ్చాయని బాబు ఎందుకు అడగడంలేదని ప్రశ్నించారు. జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది అన్న మంత్రి ఆనమే మానసిక ఉన్మాది అని గట్టు దుయ్యబట్టారు.
వైఎస్ హయాంలో ఆనం సోదరులు పిల్లుల్లాగా తిరిగారని గుర్తు చేశారు. సీఎం మారితే పదవి కోసం కిరణ్‌ను అంతకన్నా హీనంగా తిట్టగల ఆనం రామనారాయణరెడ్డిది నాలుక కాదు తాటిమట్ట అన్నారు. ఎన్డీఏ మీద ఒత్తిడి పెంచి రూ.500, రూ.1000 నోట్లను తెచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. స్టాంపు కుంభకోణం, దొంగనోట్ల ముద్రణలో టీడీపీ వారే అరెస్టయ్యారని అన్నారు. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు టీడీపీ నేతల నుంచే రికవరీ అయ్యాయని అన్నారు.
అలాంటి చంద్రబాబు రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బాబు, లోకేష్, ఆనం నాలుక కోయాలన్న కోపంలో ప్రజలున్నారని గట్టు రామచంద్రరావు చెప్పారు. నాలుకలు తెగిన నాయకులు ఏం మాట్లాడతారో వేచి చూడాలి....
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more