నా పై చేసిన ఆరోపణలకు 48 గంటల్లో ఆధారాలు చూపాలి. ఒకవేళ చూపించని పక్షంలో నేను తెలంగాణ భవన్ వస్తా.. ఎవరేం చేస్తారో చూస్తా..? అంటూ అల్టిమెట్ జారీ చేశాడు టిఆర్ఎస్ పార్టీ నుండి సస్సెండ్ అయిన నేత రఘునందన్ రావు. టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు రఘునందన రావును కెసిఆర్ సస్పెండ్ చేశారు. దీనిపై తనకు ఎటువంటి సమాచారమూ లేదు. మెదక్ జిల్లాకు చెందిన రఘునందన రావు టిఆర్ఎస్ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. గత కొద్దికాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో పార్టీకి గుడ్ బై చెబుతారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇటీవల మెదక్ జిల్లాలో పాదయాత్ర చేసిన చంద్రబాబుతో రఘునందన రావు భేటీ కావడం అధినేత కేసీఆర్ కు ఎంతమాత్రమూ మింగుడుపడలేదు. వెనువెంటనే మెదక్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షస్థానం నుంచి ఆయనను తొలగించి, మరొకరిని నియమించారు. ఈ హఠాత్ పరిణామంతో రఘునందన్ ఖంగుతిన్నారు.
తదనంతరం ఆయన పార్టీకి గుడ్ బై చెబుతారని టిఆర్ఎస్ శ్రేణులు భావిం చాయి. చివరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అధినేత కేసీఆర్ ఆయనపై సస్పెన్షన్ వేటువేశారు. టిఆర్ ఎస్ లో ప్రజాస్వామ్యం లేదని ఆ పార్టీ బహిష్కృత నేత రఘునందన్ రావు అన్నారు. రఘునందన్ ను పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీకి ద్రోహం చేశాననే తనను పార్టీ నుంచి తొలగించారని చెప్పడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. టిఆర్ఎస్ లో తాను క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశానని చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ కెసిఆర్ వెన్నంటి వున్నానని అన్నారు. కెసిఆర్ కు ప్రజాస్వామ్య విలువలపై నమ్మకముంటే తనకు షోకాజ్ నోటీస్ జారీ చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై చర్చించడానికి సిద్ధమని అన్నారు. పార్టీలో పాములు దూరుతున్నాయని చెప్పడమే తాను చేసిన తప్పని వాపోయారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కేసిఆర్ పై ఈగ వాలకుంవా చూడటమే తాను చేసిన ద్రోహమా? అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
తెలంగాణఱ ఉద్యమానికి వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా అనలేదని ఆయన బషిర్ బాగ్ ప్రెస్ క్లబ్ అన్నారు. 13 ఏళ్లుగా తెలంగాణ కోసం పార్టీలో పనిచేస్తున్న తనకు ఇచ్చిన బహుమానం ఇదేనా? అని ఆయన మండిపడ్డారు. తాను ఏ కంపెనీ వద్ద డబ్బు తీసుకోలేదని తిరుమల వెంకన్న మీద ప్రమాణం చేసి చెబుతున్నానని ఆయన అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు 48 గంటల్లో ఆధారాలు చూపాలని రఘనందన్ ఢిమాండ్ చేశారు. ఆరోపణలకు రుజువులు చూపకపోతే తెలంగాణ భవన్ కు వస్తా.. ఎవరేం చేస్తారో చూస్తా అని సవాల్ విసిరారు. ఎవరెవరిని బెదిరించి పార్టీ నేతలు ఎన్ని చెక్కులు తెచ్చారో తన వద్ద జిరాక్స్ లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఢిల్లీ అశోకా హోటల్ లోఎన్ని సూట్ కేసులు మారాయో తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కేసిఆర్ ను తప్పించాలని పార్టీ జిల్లా అధ్యక్షులతో హరీశ్ రావు మాట్లాడారని రఘునందన్ చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టించిన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు.
తెరాసలో అన్ని నిర్ణయాలు రాత్రి 10 గంటల తరవ్దాతే జరగుతాయని రఘునందన్ చెప్పారు. మీడియా లో వస్తున్న రఘునందన్ లైవ్ పొగ్రాం చూసిన టీఆర్ఎస్ నాయకుల్లో కొత్త అలజడి మొదలైంది. రఘునందన్ పై టీఆర్ఎస్ నాయకులు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయిన 48 గంటలు సమయం ఉందిగా అని కొంత టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more