చిన్నప్పటి నుంచి కష్టాలే. ఊహ తెలిసినప్పటి నుంచి చాలాసార్లు ఏడ్చా.. పస్తుల రాత్రులు ఎన్నో గడిపాను. ఇప్పుడు నగదు పారితోషకాలు ఎన్ని వచ్చినా అనుభవించడానికి ఆరోగ్యం సహకరించడం లేదు. జీవితమంతా దారిద్య్రమే’’ అంటూ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ రావూరి భరద్వాజ మనసులోని మాటలు వెల్లడించారు. కళాభవన్‌లో జరిగిన సమావేశంలో రావూరి భరద్వాజ అనేక విషయాలు వివరించారు. ఆకలి తీర్చుకోవడానికి రాయడం మొదలుపెట్టాను. ఈగ, దోమ, ఇలా అన్ని అంశాలుగా తీసుకుని కథలు రాశాను. “పాకుడురాళ్ళు’కు జ్ఞానపీఠ్ రావడం సంతోషాన్ని ఇచ్చినా, “జీవన సమరం’ నవలను పరిశీలనలోకి తీసుకుంటే ఇంకా సంతోషించే వాడినని ఆయన అన్నారు. నటీమణుల అంతరంగిక విషయాలను అక్షరీకరించిన నవల “పాకుడురాళ్ళు’ అందులో మంజరిలాంటి వాళ్లు ఇప్పటి సినీరంగంలోనూ ఉన్నారని భరద్వాజ చెప్పారు.
తన జీవిత చరిత్రను చాలా మంది రాసినా, నిఖార్సుగా నిబద్ధతతో రచించింది డాక్టర్ పిజె సుధాకర్ అని అభినందించారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 10 లక్షల పారితోషకాన్ని అందజేసినందుకు గాను ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చి పొందుపరిస్తే అవే కాలానుగుణంగా నిజరూపంలో సాక్షాత్కరిస్తాయన్నారు. తాను ఎటువంటి అవార్డులను ఆశించి రచనలు చేయలేదని, గ్రామీణ పేదరికం నుంచి వచ్చిన తనకు జీవితమే పాఠాలు నేర్పిందని, దాంట్లోంచే తాను రచయితగా మారానని తెలిపారు.కార్యదీక్షతో పనిచేస్తే ఏ వ్యక్తయినా తన లక్ష్యాలను సాధించగలడని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ అన్నారు.
ఆయన ఎఫ్‌డిసి కాంప్లెక్స్‌లో కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రచురిస్తున్న యోజన పత్రికను విడుదల చేశారు. ఆల్ ఇండియా రేడియో అదనపు డైరెక్టర్‌జనరల్ పిజె సుధాకర్ మాట్లాడుతూ 1999 జులైలోనే భరద్వాజ ముఖచిత్రంతో సంచిక ప్రచురించి జోస్యం పలికిందని గుర్తుచేశారు. యోజన పత్రిక ఆనాడు ప్రచురించిన వాఖ్యలు ఈనాడు నిజమయ్యాయని తెలిపారు. రావూరికి ఆనాటి తరం కవులైన జాఘువా, ఆత్రేయలతో పాటు ఆనాటి ముఖ్యమంత్రులు, నేతలతో మంచి స్నేహం ఉండేదని గుర్తుచేశారు.
రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ రావూరి తన ఇంటి సమీపంలో ఉండడం తమ అదృష్టమని, ఎంతో గొప్ప సాహితీవేత్త అయిన రావూరి నిరాడంబరంగా ఉంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకుడు జి.వల్లీశ్వర్ మాట్లాడుతూ రావూరి భరద్వాజ లాంటి వ్యక్తికి జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ఈ అవార్డులు ఎటువంటి పైరవీలు లేకుండా నిష్పాక్షికంగా ఇస్తున్నారనే దానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా రావూరి భరద్వాజ సోషల్ మీడియా అంశంతో ప్రచురించిన యోజన పత్రికను విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more