1886లో చికాగోలో పనివాళ్ళకి 8 గంటల మాత్రమే పనిగంటలుండాలని చేసిన సమ్మెలో జరిగిన మారణహోమానికి గుర్తుగా జరుపుకునేదే మే డే. ప్రతి సంవత్సరం మే 1న జరుపుకునే మేడే రోజు శలవు దినంగా ప్రకటించటం జరిగింది. 1889లో ఫ్రెంచ్ రివల్యూషన్ శతాబ్దిని చేసుకుంటున్న సందర్బంలో 1890 నుండి చికాగో ఘటనకు గుర్తుగా మేడే ని జరుపుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. 1991 నుంచి మేడే ను ప్రతి సంవత్సరం జరపుకునే వేడుకగా అంతర్జాతీయ ద్వితీయ కాంగ్రెస్ లో నిర్ణయం జరిగింది. ఆ తర్వాత 1894 లో మేడే విప్లవం జరిగింది. 1904 లో మే 1 వ తేదీని ఎనిమిది గంటల పనివేళలుగా పనిదినాలను నిర్ణయించటానికి, ప్రపంచ శాంతికి మేడే గా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అలాగే మే 1 న అన్ని దేశాలలోనూ శలవు దినంగా ప్రకటించాలని కూడా తీర్మానం చేసారు. ప్రపంచంలోని పలు దేశాలు మే డే ని శలవు దినంగా ప్రకటించి ప్రతి సంవత్సరం పాటిస్తున్నాయి. ఆ తర్వాత సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలకు ఈ రోజు ప్రదర్శనలకు కేంద్రబిందువైంది.
కొన్ని చోట్ల కాగడాలతో ఊరేగింపులు, ఉదయాన్నే బోనఫైర్ తో చికాగో లో హే మార్కెట్ ఘటనలో అసువులుబాసినవారి జ్ఞాపకార్థం మే డే జురుపుకుంటారు. కమ్యూనిస్ట్ దేశాలైన చైనా, నార్త్ కొరియా, సోవియట్ యూనియన్లలో మే డే ప్రాశస్తతను పొందింది.
మే డే అనేది పనిచేసే కార్మికుల కోసం తయారైన చారిత్రక ఘటన జ్ఞాపకార్థం జరుపుకునేది. అయితే హిందువులలో వైష్ణవులు విష్ణు సేవకులలా భావించినట్లుగానే, కాథలిక్ చర్చ్ సైంట్ జోసెఫ్ ది వర్కర్ అని ప్రభువు సేవలో మే 1 ని జరుపుకోవటానికి 1955 లో తీర్మానం చేసారు. అమెరికా లో మే 1 ని లాయల్టీ డే గా జరుపుకుంటారు.
ఈ రోజున అధికారికంగా శలవు ప్రకటించిన 80 దేశాలలో ర్యాలీలు, పరేడ్ లు నిర్వహించి సభలు జరిపి ప్రసంగాలు చేస్తారు.
భారతదేశంలో కూడా మే డేని శలవు దినంగా పరిగణిస్తారు. మొదటి మేడే సెలబ్రేషన్స్ ని భారత్ లో మద్రాస్ లో 1923 సంవత్సరంలో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్తాన్ ఎర్ర జెండా ఆవిష్కరించి చేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు, కర్మాగారాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక శలవుదినంగా పాటిస్తున్నారు.
తెలుగు విశేష్ తరఫున కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more