నిన్నటి నుంచే ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్ లోని జంతర్ మంతర్ లో తెలంగాణా రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుండగా, ఈ ఆందోళనకు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతుండగా, మరో పక్క తెలంగాణా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ప్రకార్డులతో పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణా మంత్రులు కె.జానారెడ్డి, బి.సారయ్య, శాసన సభ్యుడు బిక్షమయ్య గౌడ్ తదితర నాయకులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ఈ రోజు ఢిల్లీ చేరుకుంటున్నారు. వీరు అక్కడ పార్లమెంటులో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులకు మద్దతు తెలుపుతూ, వీలైతే అగ్రనాయకులను కలిసి తమవంతు తెలంగాణా వాదనను వినిపించటానికి కార్యక్రమాన్ని తయారు చేసుకున్నారు.
ఉద్యమం తెలంగాణా పేరుతోనైనా, ఎవరి కార్యక్రమాలు వారివే, ఎవరి రాజకీయ ధోరణి వాళ్ళదే. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు మీద ఎప్పటికప్పుడు ఏదో నిర్ణయం వస్తున్నట్టుగా వస్తున్న సంకేతాల నేపథ్యంలో ఎవరూ వెనక్కి తగ్గిపోగూడదని, తీరా తెలంగాణా వచ్చే సమయానికి ఎక్కడో మూలను గుర్తింపు లేకుండా ఉండగూడదని, సాధించిన తెలంగాణా రాష్ట్రంలో మా వంతు కృషి కూడా ఉందని చెప్పుకోవాలనే తహతహ కూడా అందరిలో కనపడుతోంది. తెరాస లోకి వెళ్ళటానికి ఊగిసలాడుతున్న కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టుగా కూడా కనిపిస్తోంది.
అమ్మ హస్తం కార్యక్రమంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి వివరణ ఇస్తున్నారు. మొత్తానికి ఎటూ తేల్చకుండా నానుస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం వలన గెలుపు గుర్రం మీద ఎప్పుడు పందెం కాయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాయకులంతా కొట్టుమిట్టాడుతున్నారు.
ఎన్టీ ఆర్ పుణ్యమాంటూ ఉత్తర భారతీయులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి తెలిస్తే, నాలుగైదు సంవత్సరాలుగా బాగా ఊపందుకుని వేడెక్కుతూ వస్తున్న తెలంగాణా ఉద్యమం వలన, దానికి భాజపా మద్దతు వలన, తెలంగాణా ప్రాంతం గురించి కూడా వారికి తెలిసిపోవటం విశేషం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more