రాజకీయాల్లో మూడు సార్లు హ్యాట్రిక్ విజయం సాధించిన వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా అతని పై మక్కువ చూపిస్తుంది. అలాంటి నాయకుడున్ని తమ దేశాలకు రావాలని ప్రపంచ దేశాలు పిలుస్తున్నాయి. అయితే అలాంటి నాయకుడు ప్రధాన మంత్రి కావాలని ఆ పార్టీ నాయకులు భజన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి భజన చేసే నాయకులకు షాకిచ్చారు ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని బీజేపీ తెరపైకి తీసుకువస్తున్న నేపథ్యంలో ఎన్‌డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీ(యూ) ఆయనకు వ్యతిరేక స్వరాన్ని వినిపించింది. దేశానికి నాయకత్వం వహించే వ్యక్తి లౌకికవాది అయివుండాలని స్పష్టం చేసింది. రాజధర్మాన్ని అనుసరించలాని హితవుపలికింది. తమ మాటను పెడచెవిన పెడితే పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని సుతిమెత్తగా హెచ్చరించింది. నరేంద్ర మోడీ పేరును ఉచ్చరించకుండానే బీహార్ సీఎం నితీష్ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ జాతీయ కార్యనిర్వహకవర్గ సమావేశాల చివరిరోజు నితీష్ సుమారు 45నిమిషాల పాటు ప్రసంగించారు. బీజేపీతో పాటు నరేంద్ర మోడీపై ఉన్న మతతత్త్వ ముద్రను జన్యుపరమైన మార్పిడు లతో నితీష్ పోల్చిచూపారు. అలాంటి ప్రయోగం వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని పరోక్షంగా ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై హెచ్చరించారు. తమ మాటను లెక్కచేయకుండా ముందుకే వెళితే సొంతంగా ఒక నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు. మరోవైపు తన ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై వస్తున్న ఊహాగానాలను నితీష్ తోసిపుచ్చారు. జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గబలం లేని పార్టీ ప్రధాని పదవిపై ఆశలు పెంచుకోవడం భ్రమే అవుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపై నడిపించగల నాయకుడు మాత్రమే అత్యున్న పదవికి అర్హుడన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని దీనికి సరియైన ఉదాహరణగా అభివర్ణించారు. గోద్రా అల్లర్ల తర్వాత వాజ్‌పేయి 'రాజధర్మం'పై చేసిన వ్యాఖ్యలను నితీష్ ఈ సందర్భంగా ప్రస్తుతించారు.
ఒక రాష్ట్రాన్ని ఏదో ఒక మార్గంలో నడపడం సులువైన పనేనని, యావత్ దేశానికి అదే మార్గదర్శకత్వాన్ని ఇవ్వలేమన్నారు. రాజధర్మాన్ని పాటించాలని వాజ్‌పేయి ఎప్పుడూ చెపుతుండే వారని, అలాంటి భావజాలాన్ని అనుసరించాల్సిన అవసరం బీజేపీకి ఉందన్నారు. నరేంద్ర మోడీ తరచూ చెపుతూ వస్తున్న అభివృద్ధి, సుపరిపాలన నమూనాలపై కూడా నితీష్ పలు వ్యాఖ్యలు చేశారు. ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం మరింత వృద్ధి చెందుతుందంటే ప్రజలు తప్పకుండా ఒప్పుకుంటారు, కానీ ఒక ప్రత్యేక రాష్ట్రం అభివృద్ధి ప్రక్రియను ఏ స్థాయి నుంచి ప్రారంభించిందో కూడా గమనించాలని పరోక్షంగా బీహార్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమగ్రాభివృద్ధి మంత్రాన్ని నితీష్ జపించారు. సమాజాన్ని విభజించి పాలించడంలేదని, అందరిని ఒక్కచోటికి తీసుకురావడానికి కట్టుబడివున్నామన్నారు. లౌకికవాదాన్ని నితీష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'రాజకీయాల్లో రాజీ ధోరణి అనేది తప్పనిసరి. దానిలో కొన్ని ప్రాథమిక సూత్రాలు కూడా ఇమిడివున్నాయి. అయితే అధికారంలోకి రావడానికి లౌకికవాదంపై మాత్రం రాజీ పడలేము. అలా ఎప్పుడూ చేయలేం కూడా.' అని వ్యాఖ్యానించారు. ఇటీవల కొన్ని వేదికలపై రాహుల్, మోడీ చేస్తున్న ప్రసంగాలపై కూడా నితీష్ విమర్శలు గుప్పించారు. అలాంటి సరికొత్త ప్రయోగాలతో ప్రజలను ప్రభావితం చేయలేరన్నారు. అలాంటి కొత్త పవనాలతో ప్రజలను ఒప్పించాలనుకున్నా అవి అన్నిసమయాల్లో ఫలితాన్నివ్వవని నితీష్ హితవుపలికారు. అయిన రాజకీయల్లో శత్రువులు ఉండటం మాములే. కానీ రాజకీయ శత్రువుత్వం వలన ప్రజలకు మేలు జరగదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఒక నాయకుడు అవును అంటే, మరో నాయకుడు కాదు, వద్దు అనటం రాజకీయల్లో మాములే. ఇలాంటి సవాల్ ను మోడీ ఎలా ఎదుర్కోంటాడో చూడాలి. నితీష్ పై మోడీ ఎలాంటి విమర్శలు చేస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more