పరీక్ష పేపర్లను దిద్దటానికి ఉపాధ్యాయులు తప్ప మరెవరూ పనికిరారు. విషయావగాహన ఉండేది వారికే. అందుకు వాళ్ళకి అదనపు వేతనం కూడా అందుతుంది. కానీ పేపర్లను పరిశీలించి మార్కులు వేసే ఉపాధ్యాయులు వాళ్ళున్న మూడ్ ని పట్టి, వచ్చిన విసుగునిబట్టి జవాబు పత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే ఇష్టమొచ్చిన మార్కులు వెయ్యటం అక్కడక్కడ జరుగుతుంటుంది. అయితే ఎవరి పేపరు ఎవరిదో తెలియకపోవటం కూడా ఉపయోగమే అయినా, తరగతుల్లో విద్యార్థులకు మార్కులు వేసే పనిలో ఉన్న శ్రద్ధ ఇందులో ఉండకపోవటానికి కారణముంది. తరగతుల్లో ఎవరి పేపరు ఎవరిదో తెలుసు, ఆయా విద్యార్థలకున్న జ్ఞానం, వాళ్ళ పరిమితులు తెలుసు కాబట్టి చాలా సులభంగా, ఎదురుగా ఆ విద్యార్థి ఉన్నట్టుగా భావిస్తూనే పేపరు దిద్దే అవకాశం ఉంది. కానీ యాంత్రికంగా ముక్కూ ముఖం తెలియని (ఫేస్ లెస్) విద్యార్థుల పేపర్లను దిద్దటం యాంత్రిక చర్యే అవుతుంది.
దీని వలన నష్టపోయేవారే ఎక్కువమంది ఉంటారు. నేనేమిటి పాసవటమేమిటి అని అనుకుని ఆశ్చర్యపోయేంత ఎక్కువ మార్కులు వచ్చిన వారు చాలా అరుదు, అలాంటి వాళ్ళు ఏ అభ్యంతరాలు తెల్పరు కూడా. కానీ వస్తాయనుకున్న మార్కులు రానివాళ్ళకి విద్యా శాఖ చేసిన వెసులుబాటు వలన వాళ్ళు కోరిన పేపరును పునఃపరిశీలన చేయటానికి కోరుకునే అవకాశం కలిగింది. అందులో చాలా మందికి మార్కులు పెరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మరి మొదటిసారే ఎందుకు సరిగ్గా చూడలేదు పేపరుని అని అన్నా దానికి ఎవరి దగ్గరా సమాధానం ఉండేది కాదు. కానీ దరిమిలా విద్యాశాఖ అటువంటి తప్పిదాలను చేసినవారిని అనర్హులుగా చేసింది.
ఈసారి విద్యాశాఖ 1500 మంది బాధ్యతారహితంగా మార్కులు వేసిన ఉపాధ్యాయులను ఈ పనికి దూరంగా ఉంచింది. దానితో రెండు సంవత్సరాలలో 6000 మంది పరీక్షా జవాబు పత్రాలను పరిశీలించే అర్హతను కోల్పోయారు. 1,32,00,000 పదవ తరగతి జవాబు పత్రాల పరిశీలన నిన్న మొదలైంది. వీటిని పరిశీలించి మార్కులు వేయటానికి రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మందిని ఎంపికచేసారు. తప్పు చేసిన ఉపాధ్యాయులకు పేపర్లు దిద్దటానికి అనర్హత ప్రకటించటమే కాకుండా దండనలు కూడా మొదలవటంతో విద్యార్థుల భవిష్యత్తుని కాకపోయినా తమ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునైనా ఉపాధ్యాయులు బాధ్యతా యుతంగా దిద్దటం మొదలుపెడతారని విద్యాశాఖ ఆశిస్తోంది.
విద్యాబోధన యాంత్రికమైనట్లే మార్కులు వెయ్యటం కూడా యాంత్రికం అవటమే ఇందుకు కారణం. కానీ అలా చెయ్యకపోతే కొంత మంది విద్యార్థుల మీద అభిమానం, కొందరి మీద వ్యక్తిగత ద్వేషాల ప్రభావం పడవచ్చనే ఈ పద్ధతిని దశాబ్దాల క్రితమే అమలు చేసారు. అయితే ఇందులోనూ సమస్యలు ఎదురవటంతో, తప్పు చేసిన ఉపాధ్యాయుల మీద కఠిన చర్యలు తీసుకోవటం జరిగింది.
విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకునే అలాంటివాళ్ళకి దండన విధించటం చాలా అవసరమేనని విద్యార్ధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు భావిస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more