లేబర్ మినిస్టర్ దానం నాగేందర్, ఆయన డ్రైవర్, ఆయన ఇద్దరు అనుచరులమీద, గ్రే హౌండ్స్ ఉద్యోగి సాంబశివరావు మీద దాడి చేసినందుకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్లో, ఇన్ స్పెక్టర్ నిస్సహాయంగా చూస్తుంటే, మంత్రి సమక్షంలోనే దానం అనుచరులు బాలు, నరసింహలు, ఆయన కారు డ్రైవర్ కూడా సాంబశివరావుని నిన్న ఎడాపెడా వాయించారు.
అసలు జరిగిందేమిటా అని ఆరాతీస్తే, గురువారం నాడు సాగర్ రోడ్ లో సాంబశివరావు వేరే ఒక వాహన చోదకుడితో వాదనకు దిగాడు. అసలే ఇరుకుగా ఉన్న రోడ్డు, అందులో వాహనం రోడ్డు మీద ఒకపక్కకు జారటంతో సాంబశివరావు అతనితో గొడవపడుతుండగా, మంత్రి దానం నాగేందర్ అనుచరులిద్దరూ, ట్రాఫిక్ కి అడ్డుగా ఉన్నారు ముందు పక్కకి తప్పుకోండంటూ విసురుగా మాట్లాడితే సాంబశివరావు కూడా అంతే విసురుగా సమాధానమివ్వటంతో వాళ్ళిద్దరూ, కారు మంత్రి డ్రైవరు కూడా సాంబశివరావు మీద కలియబడ్డారు. జరుగుతున్న గొడవను చూసి పోలీసు బలగాలు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఎవరెవరు ఏమిటో తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పేది నిజమో కాదా నిర్ధారణ చేసుకోవటానికి మంత్రి నాగేందర్ ని పిలిపించగా, ఆయన వచ్చి సమస్యను పరిష్కరించకపోగా, సాంబశివరావుని నాలుగు పీకమని చెప్పగా పోలీస్ స్టేషన్ లోనే మంత్రి ఆదేశాన్ని పాటించారు వాళ్ళు. దీని మీద కేసు నమోదు చేసి బంజారా హిల్స్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మురళీ మోహన్ దర్యాప్తు చేస్తున్నారు.
దానం నాగేందర్ మీద గతంలో కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. మూడు నెలల క్రితం బంజారా హిల్స్ రోడ్ నం.12 లో తిరుపతి వర్మ అనే లాయర్ మీద విరుచుకుబడ్డ నాగేందర్ మీద ఆ లాయర్ పెట్టిన కేసు దర్యాప్తు ఇంకా నడుస్తూనేవుంది.
బంజారా హిల్స్ లక్ష్మీనారాయణ ఆలయంలో అంతా సవ్యంగా నడవటంలేదని ఆగ్రహించి ఆగస్ట్ 2012 లో ఆయన ఆలయం ప్రధాన ద్వారానికి తాళం వేయటం జరిగింది. చట్టాలను చేస్తూ చట్టాలను పరిరక్షించవలసినవాళ్ళు ఇలా ప్రవర్తిస్తుంటే వాటి సంకేతాలు సామాన్య ప్రజలకు ఏమని చెప్తున్నాయి. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నప్పుడు మనం చెయి పెట్టేది శపథం చేసేది భగవద్గీత మీదనే. సమాజంలో పెద్దలు నాయకుల మీద బాధ్యత చాలా ఉంటుంది. సామాన్య ప్రజలు వాళ్లను చూసి అనుసరించేవిధంగా వారి ప్రవర్తన ఉండాలని గీతలో స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more