అత్యాచారానికి గురైన అమ్మాయి కాల్చుకుని చనిపోయిన ఘటనకు బాధ్యులెవరన్నది తేలాలి!
తొమ్మిదవ తరగతి విద్యార్థిని మీద ముగ్గురు వ్యక్తులు దాడి చేసి ఆమె బట్టలు చింపి లైంగికంగా వేధించగా ఆ అమ్మాయి నిన్న చనిపోయింది. అయితే ఆ అమ్మాయి చనిపోవటానికి నిజమైన బాధ్యులెవరు అన్నది తేలవలసివుంది.
జరిగిన సంఘటనను సవివరంగా బాధితురాలి ఫొటోతో సహా ఒక హిందీ పేపర్లో ప్రచురించారు అత్యుత్సాహంగా, బాధ్యతా రహితంగా పని చేసిన ఒక దినపత్రికవాళ్ళు. అది చూసిన బాధితురాలు జరిగిన దానికి కలుగుతున్న మనస్తాపం మరింత ఎక్కువై, జరుగుతున్న ప్రచారానికి వేదన గురై తనకు తాను నిప్పు అంటించుకుంది. 90 శాతం గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆ అమ్మాయి నిన్న చనిపోయింది.
మురాదాబాద్ సివిల్ లైన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలియజేసిన దాని ప్రకారం, పోయిన సోమవారం అత్యాచారానికి గురైన ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురునీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్లో పడ్డ వార్తను చూసి ఆమె బుధవారం నాడు తనకు తాను నిప్పు అంటించుకుంది. వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్చారు. ఆ తర్వాత ఢిల్లీ సఫ్దర్ జంగ్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాధితురాలు నిన్న ప్రాణాలు వదిలింది.
బాధితురాలు అంటే ఆ బాధను నిజంగా కలిగించినవారు ఎవరు? వేధించిన ముగ్గురు యువకులా లేక జరిగిన అవమానాన్ని ప్రచారం చేసిన హిందీ దిన పత్రికా? దిన పత్రికను నడుపుతున్న వాళ్ళకి శిక్ష విధిస్తే వేధించిన యువకులకు శిక్ష ఉండదా? శిక్ష వాళ్ళకేనా, దినపత్రిక యాజమాన్యానికి ఉండదా? ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది.
ఒక వ్యక్తిని మరో వ్యక్తి హత్య చెయ్యటానికి కత్తితో పొడిచాడనుకోండి, అతను ఇంకా చనిపోకముందే మరో వ్యక్తి ఆ సంగతి తెలిసో తెలియకో మరో ఆయుధంతో కానీ లేక అదే ఆయుధంతో కానీ మరోసారి దాడి చేసినట్లయితే, ఆ చివరి సారి చేసిందే హత్య అవుతుంది, మొదటి సారిది హత్య ప్రయత్నమవుతుంది. అలాగే అప్పటికే చనిపోయిన మనిషిని మూడవ వ్యక్తి వచ్చి మరోసారి హత్య చేసే ఉద్దేశ్యంతోనే ప్రహారం చేసినా అది హత్య అవదు. ఎందుకంటే అప్పటికే ఆ మనిషి చనిపోయాడు కనుక.
ఇది మానవ హత్యానేరంలో జరిగేది. కానీ మనిషి సెంటిమెంట్ కి సమాజంలో ఇచ్చే గౌరవ మర్యాదలకు, ముఖ్యంగా భారత దేశం శీలానికి ఇచ్చే ప్రాధన్యతను దృష్టిలో పెట్టుకుంటే శిక్ష అందరికీ పడాల్సిందే అంటారు మేధావివర్గంవారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more