సభలో వినిపించిన తెలంగాణాలో వాదం
ఈ రోజు అవిశ్వాస తీర్మానంమీద చర్చకు శాసనసభలో అనుమతించిన సందర్భంగా, తెలంగాణాకు అన్యాయం వలనే అవిశ్వాసం ప్రకటించాల్సి వస్తోంది అన్నారు తెలంగాణా రాష్ట్ర సమితి నాయుకుడు హరీష్ రావు.
నడుస్తున్న ప్రభుత్వంమీద ఇలా అవిశ్వాస తీర్మానం పెట్టటం బాధాకరమే కానీ, తెలంగాణా ప్రాంత ప్రజల చిరకాల వాంఛ, బలిదానాలతో కూడుకున్న పోరాటం దృష్ట్యా పెట్టవలసివచ్చిందన్నారు. ఏ పార్టీ మారినా నష్టపోయింది తెలంగాణాయే అన్నారాయన.
హరీష్ రావు మాటలకు అడ్డువస్తూ, 2009 నుండి పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ విషయం మాట్లాడితే బావుంటుందని ఛీప్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
సమైక్య ఆంధ్ర ప్రదేశ్ వలన తెలంగాణాకు ఒరిగిందేమీ లేదని, ఉస్మానియా, గాంధీ, కాకతీయ విశ్వవిద్యాలయాలు అంతకు ముందువేనని చెప్పారు హరీశ్ రావు. తెలంగాణా నాయకుడు పివి నరసింహారావుని ప్రధానిని చేసామని అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మండిపడుతూ, అయితే మరి ఢిల్లీలో ఇతర ప్రధాన మంత్రులకున్నట్టు పివి ఘాట్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణా రైతులను పట్టించుకోవటం లేదని, 2009 లో ఎన్నికలప్పుడు 9 గంటల విద్యుత్తునిస్తామన్న కాంగ్రెస్ మాటలేమయ్యాయని అడిగారు హరీష్ రావు. కరువు మండలాల ప్రకటనలోనూ తెలంగాణాకు అన్యాయం జరిగిందని, వడగళ్ళ వానతో పంట నష్టం జరిగినప్పుడు రైతులకు పెట్టుబడి రాయితీలనివ్వలేదుని హరీష్ రావు ప్రభుత్వాన్ని ఆరోపించారు.
తెలుగు దేశం పార్టీని ఉద్దేశిస్తూ, పోయిన సారి అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతునిచ్చామని, ఇప్పుడు ఈ సారి మద్దతునివ్వమని హరీష్ రావు సభాముఖంగా తెదేపాను కోరారు.
తెలంగాణా ఉద్యమం వలన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్న ముఖ్యమంత్రి మాటలను తెరాస నేత ఈటెల రాజేందర్ తప్పు పట్టారు. మా రాష్ట్రం మాకివ్వండి, మా బిడ్డలకు మేం చెప్పుకుంటాం చదువులు అన్నారాయన.
కాంగ్రెస్ ప్రతివాదన
అవిశ్వాస తీర్మానం ప్రభుత్వం మీద పెట్టారు దాని మీద మాట్లాడండి కానీ నన్ను వ్యక్తిగతంగా వ్యాఖ్యానాలకు గురి చెయ్యకండి. నేను మీ దయాదాక్షిణ్యాల మీద ముఖ్యమంత్రి ని కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వలన అయ్యాను. అదే కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల వలనే హరీష్ కూడా మంత్రి అయ్యారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు తెరాస ప్రభుత్వం మీద తెచ్చిన అవిశ్వాస తీర్మానం లో జరుగుతున్న చర్చల్లో తీవ్రస్థాయిలో స్పందించారు.
కాంగ్రెస్ సభ్యుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ, కెసిఆర్ కేంద్ర మంత్రిగా ఉండి కూడా కార్మికుల గోడు పట్టించుకోలేదు అనగా, ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడటం సబబు కాదని ఈటెల అభ్యంతరం తెలియజేసారు.
హరీశ్ రావు వాడిన భాష మీద అభ్యంతరాలు తెల్పిన కిరణ్ కుమార్ రెడ్డి, ఎవరికో భయపడి మేము పనిచెయ్యటం లేదని, ఏ ప్రాంతానికి ఎప్పుడు ఏం చెయ్యాలో మాకు తెలుసని అన్నారు. ఆ ఇచ్చేది మేము ఇస్తాము కానీ మీకు భయపడి చేసే పనికాదది అన్నారాయన. మీకు భయపడి ఒక్క పైసా కూడా ఇవ్వమని అన్నారు. ఈ మాటలకు అభ్యంతరం తెలియజేసిన ఈటెల, రాగద్వేషాలకు అతీతంగా పనిచెయ్యవలసిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం మంచిది కాదని అన్నారు.
కాలర్ పట్టుకుని నిజామాబాద్ కి మెడికల్ కాలేజి ఇప్పించామని అన్న హరీష్ రావు మాటలకు మండిపడుతూ, నేను పుట్టింది హైద్రాబాద్ గడ్డ మీదనే. చదివిందీ ఇక్కడే. నన్ను బెదిరించే దమ్ము మీకు లేదు అంటూ సవాల్ చేసారు ముఖ్యమంత్రి. తెలంగాణాకు తెరాస ఏం చేసిందని అడుగుతూ, ఒక్క ప్రాంతానికే అభివృద్ధిని కట్టబెట్టే ఉద్దేశ్యం మాకు లేదని అన్నారు. రాయల సీమ, ఉత్తరాంధ్ర కూడా వెనకబడే ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ను ఆయన గుర్తు చేసారు. బెదిరిస్తే పారిపోయే వాడిని కానని చెప్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ జిల్లాలో ట్రాక్టర్ల ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించిందని, విమానాల విడిభాగాల ఉత్పత్తి చేసే విభాగం కూడా తెలంగాణాలోనే స్థాపించామని, అలాగే తాగు నీటికోసం అల్లాడుతున్న చిత్తూరు జిల్లాకి నీళ్ళిస్తే మీరు మమ్మల్ని విమర్శిస్తారని అన్నారు ముఖ్యమంత్రి.
తెరాస కు మద్దతుగా నిలబడ్డ వైకాపా అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గద్దె ఎక్కించిన వైయస్ ఆర్ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చెయ్యటం లేదని చేసిన వ్యాఖ్యలకు, మంత్రి కన్నా అభ్యంతరం తెల్పుతూ, అసలు వైయస్ ఏ పార్టీకి చెందిన నాయకుడు, మీది ఏ పార్టీ అని అడిగారు. కాంగ్రెస్ అధిష్టానం పెట్టమన్న పథకాలనే ఆయన తీసుకొచ్చారని కన్నా అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more