బంగారు బాబు అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాదు. ఈ బంగారు బాబు అక్కినేని బాబు. 1973 మార్చి 15న విడుదలైన ‘బంగారు బాబు’ సినిమా నేటికి 40 ఏళ్లు పూర్తి చేసుకొని వెండితెర జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఆ జ్ఞాపకమే ‘బంగారు బాబు’. రొమాంటిక్ ఇమేజ్, మాస్ ఇమేజ్ శంఖుచక్రాల్లా చేసుకున్న అభినయ శ్రీనివాసుడు అప్పట్లో అక్కినేని. అలాంటి అగ్రహీరోని డెరైక్ట్ చేసే అవకాశాన్ని రెండోసారి దక్కించుకోవడం సాధారణమైన విషయం కాదు. పైగా అక్కినేనితో వీబీ డెరైక్ట్ చేసిన తొలి సినిమా ‘దసరా బుల్లోడు’. ఆ సినిమా అప్పటి వరకూ ఉన్న రికార్డులు మొత్తాన్నీ తిరగరాసేసింది. ఆ సినిమా తర్వాత మళ్లీ అక్కినేనితో సినిమా అంటే అంచనాలు చుక్కల్లో ఉంటాయి. కానీ చేయాలి. ఆ స్థాయిలోనే తీయాలి. గట్టి పట్టుదలతో కథాన్వేషణలో పడ్డారు వీబీ. ఆ సమయంలో ఓ తమిళ చిత్రంలోని పాయింట్ ఆయనకు బాగా నచ్చింది. వెంటనే ఆరు వేల రూపాయలు వెచ్చించి ఆ సినిమా హక్కులు తీసుకున్నారు. నచ్చిన పాయింట్ మినహా కథ మొత్తం పూర్తిగా మార్చేశారు. ఈ కథామథనంలో ఆత్రేయ పాత్ర పెద్దదే అని చెప్పాలి. అయితే.. హీరోయిన్‌ని ‘సినిమాస్టార్’గా చూపించాలనే ఆలోచన మాత్రం వీబీఆర్‌దే. కథ విన్నవెంటనే అక్కినేని కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యారు. అయితే... ‘నెలా పదిహేను రోజుల్లో హార్ట్ ఆపరేషన్ నిమిత్తం నేను అమెరికా వెళ్ళాలి. ఈ లోపే షూటింగ్ పూర్తయిపోవాలి’ అనే షరతు పెట్టారు. దాంతో హడావిడిగా షూటింగ్ మొదలు పెట్టారు. అప్పట్లో ఊటీలో షూటింగ్ అంటే రిస్క్‌తో కూడుకున్న విషయం. లైటింగ్ లేకపోవడంతో షూటింగ్ సజావుగా సాగేది కాదు. అలా ప్రారంభం నుంచి ‘బంగారుబాబు’కి ఒడిదుడుకులే. అన్ని కష్టాలను అధిగమించి 40 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు వీబీ.
‘బంగారుబాబు’ అనగానే అద్భుతమైన పాటలు, మహామహుల అద్వితీయమైన నటనాపటిమతో పాటు గుర్తొచ్చేది ‘హెలికాప్టర్ ఎపిసోడ్’. అప్పట్లో హెలికాప్టర్‌తో షూటింగ్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. పైగా అప్పటి హెలికాప్టర్ల సామర్థ్యం ముగ్గురు మనుషులే. కానీ రిస్క్ చేసి హెలికాప్టర్‌పై ఫైట్ సీన్ తీశారు వీబీ. హీరో, హీరోయిన్, విలన్.. వీరితో పాటు పైలట్. వాణిశ్రీతో ఈ ఎపిసోడ్‌లో చేయడం రిస్క్ అని డూప్‌ని పెట్టారు. ఇక అక్కినేని అయితే డూప్ లేకుండా ఆ ఫైట్ చేయడం విశేషం. అప్పట్లో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఫైట్ ఇది. అంతేకాక, పూర్తి స్థాయి సినిమా నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే.వాణిశ్రీ ఓ విధంగా ఇందులో నిజజీవిత పాత్రే పోషించారు. పాత్ర పేరు కూడా వాణీనే. అన్ని భాషల్లోనూ ఎదురులేని హీరోయిన్ ఆమె. అందుకే శివాజీగణేశన్, రాజేష్‌ఖన్నాల కాంబినేషన్లలో కొన్ని సీన్స్ తీశారు వీబీ. ఇక ఆత్రేయ సాహిత్యం, మహదేవన్ సంగీతం ఈ చిత్రంలోని ప్రతి పాటనూ ఓ ఆణిముత్యంలా నిలబెట్టింది. దాదాపు 16 కేంద్రాల్లో వందరోజులు పూర్తి చేసుకుందీ సినిమా. 1973 జూన్ 24న మద్రాసు విజయాగార్డెన్స్‌లో ఈ చిత్రం శతదినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్, శివాజీగణేశన్‌లు ఈ వేడుకకు అతిథులుగా విచ్చేశారు.
గుండె ఆపరేషన్‌కి వెళ్లే ముందు అక్కినేని చేసిన సినిమా ఇది. అలాంటి పరిస్థితుల్లో కూడా డూప్‌లేకుండా ఆయన హెలికాప్టర్ ఎపిసోడ్ చేయడం ఆయనలోని పట్టుదలకు నిదర్శనం. దాదాపు 20 నిమిషాల పాటు హెలికాప్టర్ కింద ఉండే ఇనుపకడ్డీలను పట్టుకొని గాల్లోనే ఫైట్ చేశారాయన. మాకు కట్ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. వాణిశ్రీ ఎంతో కేర్ తీసుకొని నటించిన పాత్ర ఇది. ఇందులో ప్రతి పాట, ప్రతి సీన్ అప్పట్లో హైలైట్‌గానే చెప్పుకున్నారు. అయితే... ప్రథమార్ధం వచ్చినంత బాగా ద్వితీయార్ధం రాలేదని నా ఫీలింగ్. హెలికాప్టర్ ఎపిసోడ్‌లో వాణిశ్రీకి డూప్ పెట్టడం వల్ల క్లోజప్ షాట్‌లు సరిగ్గా రాలేదు.ఏది ఏమైనా ‘బంగారుబాబు’ మాత్రం నాకు ఆర్థికంగా లాభాలనే అందించాడని వి.బి.రాజేంద్రప్రసాద్ అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more