పక్కా రంగమ్మా, చీర పోయినా రంగు పోదు అన్న చీరెల వ్యాపారి మాటల్లా అనిపించవచ్చు కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మానవులు భూమ్మీద ఇంకా ఎంత కాలం బ్రతుకుతారో తెలియదు కానీ భూమ్మీద జరిగిన పరిణితి, మానవుల జీవన శైలి, సాధించిన విశేషాలను రోదసీలో కి పంపించి అక్కడ భద్ర పరిస్తే, భూమి లేకుండాపోయినా, భూలోక వాసుల జీవన విశేషాలు అంతరించిపోకుండా ఉంటాయన్నది వైఙానికుల తాపత్రయం. గ్రహాంతరవాసులకు భూలోకంలోని మనుషుల గురించి అధ్యయనం చెయ్యటానికి ఆసక్తికరమైన విషయం దొరుకుతుంది. ఆ గ్రహాంతరవాసులం మనమే కూడా కావొచ్చునేమో. భూమ్మీద కాలుష్యం ఎక్కువైపోయి, చంద్రుడు ఇతర గ్రహాల మీదకు వలసపోయిన తర్వాత మన పిల్లలకు భూమి బాబాయి కథల్లాగా (చందమామ కథల్లాగా) చెప్పటానికి పనికిరావొచ్చు నేమో. 2018 నాటికల్లా భూమ్మీది నుంచి దంపతులను అంగారక గ్రహం (మార్స్) కి పంపిస్తామని వైఙానికులు అందుకు కావలసిన ఏర్పాట్లలో ఉన్నారు కూడా.
వైఙానికుల ప్రణాళిక ప్రకారం, భూమికి 36000 కి.మీ. దూరంలో అంతరిక్షంలో ఎకో స్టార్ 16 అనే ఉపగ్రహం మన మానవుల జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను మోసుకుంటూ తిరుగుతుంటుంది. అందులో 12 సెం.మీ. వ్యాసంతో ఉన్న డిస్క్ లో 100 చిత్రాలుంటాయి. ఆ చిత్రాలు మన సంస్కృతిని, మన తెలివితక్కువ తనాన్ని, సహజ సంపదలను, వాటిని మనం నాశనం చేసుకున్న తీరుని చూపిస్తాయి. ఈ వైఙానికి ప్రణాళిక వెనక ఉండి నడిపిస్తున్న కళాకారుడు ట్రేవర్ పాగ్లెన్ మాటల్లో చెప్పాలంటే, భూమిని ఆ చిత్రాలు వెంటాడుతుంటాయి. వేలాది చిత్రాలను ఓపిగ్గా పరిశీలించి వాటిలోంచి వంద చిత్రాలను ఎన్నుకున్నారాయన. వాటిని మాసాష్యూసెట్స్ ఇన్స్ స్టిట్టూట్ ఆఫ్ టెక్నాలజీ లోని వైఙానికులు ఎల్లకాలం నిలిచివుండే విధంగా సిలికాన్ తో తయారు చేసిన వేఫర్ మీద చెక్కి దాన్ని బంగారు డిస్క్ మీద అమర్చి ఉపగ్రహానికి అమర్చారు.
పోయిన సంవత్సరం నవంబరులో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించిన ఈ ఉపగ్రహం భూమికి సమాంతర స్థానంలో నిశ్చలంగా పెట్టబడింది. అంటే, భూమి ఏ వేగంతో తిరుగుతుందో దానికనుగుణమైన వేగంతో తిరుగుతూ ఎప్పుడూ భూమికి ఒకే దిశలో ఒకే దూరంలో ఉండేటట్టుగా అంతరిక్షంలో ప్రవేశపెట్టబడిన ఉపగ్రహం ఈ ఇకో స్టార్ 16. సూర్యరశ్మి వలన కరిగిపోయి అంతరించేంతవరకూ అది అలా తిరుగుతూనేవుంటుంది. అయితే 15 సంవత్సరాల కాలం వరకు ఇది పనిచేసేట్టుగా ప్రస్తుతానికి దీన్ని రూపొందించారు.
అలా మనచుట్టూ తిరుగుతున్న ఆ చిత్రాలలో గుహల్లో నివసించిన ఆది మానవుల దగ్గర్నుంచి, చంద్రయానంలో అపోలో వ్యోమగాములు తీసిన సూర్యోదయం చిత్రాల వరకూ ఉన్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, పూర్వకాలపు ఆవిరి యంత్రాలు, అణుబాంబు చేసిన విధ్వంసం ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులు ముఖానికి తొడుక్కున్న మాస్క్ లు, కోళ్ళ ఫారాల్లో గూళ్ళలోంచి చూస్తున్న కోళ్ళు, పెద్ద ఆపరేషన్ థియేటర్ లో ఖాళీ గా ఉన్న టేబుల్ మీద అంటుకుని ఉన్న రక్తపు మరకలు ఇలాంటి చిత్రాలను చూస్తే ఎన్నో విషయాలు అవగతమౌతాయి. అప్పటి వాళ్ళ బాధలు, పడ్డ కష్టాలు, ఎదుర్కున్న సమస్యలేమిటన్నవి అర్థమౌతాయి. అయితే ఆ చిత్రాల్లో ఈ మధ్య బాగా ఆడి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమాలోని స్టిల్ కూడా ఉంది. ఒక వేళ మానవులంతా భూమ్మీది నుంచి వలసపోయి, ఇక్కడ భూమిమీదంతా కోతుల రాజ్యంగా కోతుల ఏలుబడిలో ఉంటే అప్పుడు వచ్చి తిరిగి ఫొటోలు తీసుకోలేము కాబట్టి అది పనికివస్తుంది.
అయితే అలా మన సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను రోదసీ లోకి పంపించటం ఇది మొదటిసారి కాదు. 1970 ప్రాంతంలో పంపించిన జూపిటర్ 10, 11 ల మీద చెక్కిన రేఖా చిత్రాలలో ఒక ఆడ మగ జాతుల నగ్న చిత్రాలున్నాయి. అవి జూపిటర్ శాటర్న్ కి పంపబడ్డాయి. అందులో పురుషుడు ఒక చేత్తో అభివాదం చేస్తూ, మరో చేతితో ఆ కింద గీసిన సౌరవ్యవస్థను చూపిస్తుంటాడు. దానితో అది ఏ లోకం నుంచి వచ్చిందన్నది తెలుస్తుంది. ఆ రెండు వ్యోమనౌకలూ 35 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పనిచేస్తునేవున్నాయి. అందులో బంగారు రికార్డ్ లలో నిక్షిప్తమైవున్న ఆడియో సందేశాలు కూడా ఉన్నాయి. వాటిని ఎలా పలికించాలన్న సాంకేతిక వివరం కూడా పక్కనే ఇవ్వబడింది. ఒకవేళ ఏ గ్రహాంతరవాసో దాన్ని చూసినట్లయితే, ఉపయోగించగలిగితే, అందులో సహజ శబ్దాలైన సముద్ర ఘోష, పిడుగులు, వేల్స్ చేసే శబ్దాలే కాకుండా, 55 భాషల్లో చేసిన అభివాదం, కొంత సంగీతాన్ని కూడా వినగలుగుతారు.
అంతకు ముందు పంపించిన పయోనిర్, వాయేజర్ సందేశాలు గ్రహాంతరవాసులైన ఇతర జీవరాశులకు మేము మానవులమనేవాళ్ళం ఇక్కడున్నాం సుమా అని తెలియజేయటానికి పంపించినవి. కానీ ఇప్పుడు పంపించే చిట్టచివరి ఫోటో సంకేతాలు వాటికి భిన్నంగా ఉంటాయన్నారు పాగ్లేన్. అసలు వీటిని చూసేవారు, వినేవారు ఉంటారా అన్నది కూడా సందేహమే అన్నారాయన. కానీ మన సంస్కృతి, పరిణితి ప్రతిబింబించే చిత్రాలను భావి కాలంలోని వారికోసం భద్రపరుస్తున్నాం. 20000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మనకోసం గుహల్లో ఎన్నో విషయాలను మనకు చిత్రాల రూపంలో అందించారు. అలాగే మనం కూడా మన తరువాతి వారికోసం రోదసీలో భద్రపరుస్తున్నాం ఎందుకంటే భూగోళం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి. అని పాగ్లేన్ తన మనసులోని మాటను చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more