తెలంగాణ కొసం తెలుగు దేశం పార్టీని వీడి, సొంతగా తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేసుకొని, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్న నాగం జనార్థన్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావుకు మధ్య వివాదం తారా స్థాయికి చేరినట్లే కనిపిస్తుంది. ఇన్ని రోజులు లోలోపల ఉన్న ఈ వ్యవహారం నాగం కేసీఆర్ పై బహిరంగ విమర్శలు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. నాగం జనార్థన్ రెడ్డిని జాక్‌లో చేర్చుకోకుండా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అడ్డు పడుతున్నట్లు నాగం ఆరోపించారు. ఒకవైపు తెలంగాణ కోసం రోజూ బలిదానాలు జరుగుతుంటే ఆ పార్టీకి ఎన్నికలే కావాల్సి వచ్చాయా ? పార్టీ సమావేశంలో బలిదానాలపై చర్చించరా ? అని ప్రశ్నించారు. జనార్దన రెడ్డిని జాక్‌లో చేర్చుకోవటానికి బీజేపీ, సీపీఐఎంఎల్ (న్యూ డెమాక్రసీ)తో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సైతం సుముఖంగా ఉన్నప్పటికీ కేసీఆర్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. నాగం వ్యాఖ్యలతో ఇది నిజమేనని తెలుస్తుంది. ఈ పరిస్థితి ఇలా ఉంటే నాగం విషయంలో జాక్ చైర్మన్ కోదండరామిరెడ్డి ఎటూ చెప్పలేకపోతున్నారు.
అయితే నాగం ని చేర్చుకోక పోవడానికి రాజకీయ వర్గాలు కొన్ని కారణాలు ఉన్నాయంటున్నాయి. నాగం చేరితే సమాంతర శక్తిగా ఎదుగు తారని, తన మాట చెల్లుబాటు కాకుండా పోతుందన్న అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టు చెబుతు న్నారు. నాగం చేరితే రెడ్ల ప్రాబల్యం పెరుగుతుందన్న అభిప్రాయం కేసీఆర్‌కు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే జాక్ చైర్మన్ కోదండరామిరెడ్డి కొంతకాలం క్రితం సమాంతర శక్తిగా ఎదిగిన సందర్భంగా టీఆర్‌ఎస్ దాదాపు జాక్‌కు దూరమైంది. ఇప్పుడు నాగం కనుక జాక్‌లో చేరితే ఆయన ప్రభావం బలంగా ఉంటుందన్న అనుమా నంతో కేసీఆర్ భావించి చేర్చుకోవడం లేదని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more