వరంగల్ జిల్లాలో జరుగుతున్ సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేందుకు టీఆర్ఎస్ కు మద్దతిస్తామంటూ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు , తెలంగాణ ఫోరం కన్వీనస్ ఎర్రబెల్లి దయాకరరావు చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో వివాదాస్పదమై, తీవ్ర కలకలం స్రుష్టించాయి. టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ ద్రోహంటూ నేటిదాకా వ్యక్తిగత దూషణలతో ఆడిపోసుకున్న టిఆర్ఎస్ కు మద్దతిస్తామని ఎర్రబెల్లి ఏకపక్షంగా ఎలా ప్రకటించారని పలువురు తెలుగుతమ్ముళ్లు తమతమత లాబీల్లో మండిపడుతున్నారు. కాంగ్రెస్ తో కుమ్మకై టీడీపీ దెబ్బతీయడానికి ఇంతవరకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు చెబుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కోపపడ్డారు. వ్యక్తిగతమైన వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బందులు తేవొద్దని ఆయనకు బాబు క్లాస్ తీసుకున్నారు. ప్రత్యేక, సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్టీ నేతలందరూ మౌనంగా ఉన్నారు. సహకార ఎన్నికల్లో పార్టీకి అనుకూలం పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో టిఆర్‌ఎస్‌తో పొత్తులుంటాయంటే పార్టీ ఇరుకున పడుతోంది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో వస్తున్నా...మీ కోసం పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు పార్టీని గందరగోళానికి గురి చేస్తాయి. సహకారం ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేసినంతరం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2009 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని కోలుకోలేనంత నష్టపోయామని పేర్కొన్నారు. ఈ కారణంగా అధికారానికి దూరమైనట్లు చంద్రబాబు గుర్తు చేశారు. సహకార ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మద్దతు ఉంటుందంటే సాధారణ ఎన్నికల్లో పొత్తు ఉంటుందన్న సంకేతాలు వెళతాయని పార్టీ నేతలు అంటున్నారు. ఎర్రబెల్లిపై తెలంగాణ టిడిపి నేతలు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణపై స్పష్టత ఇచ్చామని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు ఆదేశించారు. ఎర్రబెల్లితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి వివరణ అడిగిటన్లు తెలుస్తోంది. తొందరపాటు వ్యాఖ్యలు చేసి పార్టీని ఇరకాటంలో పెట్టద్దని, పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలివ్వొద్దని ఆగ్రహించినట్లు చెబుతున్నారు. అయితే ఎర్రబెల్లి వివరణపై బాబు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ, పొలిట్ బ్యూరో సభ్యునిగా కీలకమైన బాధ్యతల్లో ఉంటూ.. ఇలాంటి తొందరపాటు వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని చంద్రబాబు సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more