రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలో కదలిక వచ్చింది. నెహ్రు, ఇందిర, సోనియా ప్రధాని మన్మోహన్ సింగ్ లపై కేసిఆర్ చేసిన విమర్శలకు కిరణ్ కుమార్ రెడ్డిలో వేడిని పుట్టించాయి. కిరణ్ తన సైన్యంతో గులాబి నేత కేసిఆర్ పై మాటల యుద్దం చేశారు. కిరణ్ కుమార్ సైన్యంలో తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారు. సమరదీక్షలో గులాబీ నేత కేసిఆర్ రెచ్చిపోయి కాంగ్రెస్ పార్టీ పై ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీని బదులుగా అమ్మ సైన్యం గులాబీ దండు పై విమర్శల యుద్దం చేసింది. కేసిఆర్ వాడిన పదాలు, బాషతో తెలుగువారు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంతంలోని ఉప ప్రాంతీయ పార్టీ నేత అయిన కేసిఆర్ కు తమ పార్టీ నేతలను విమర్శించే స్థాయి లేదని, ఆకాశం మీద ఉమ్మెస్తే కేసిఆర్ మీదే పడుతుందనే విషయం కేసిఆర్ గమనించాలని కిరణ్ కుమార్ రెడ్డి సైన్యం సూచించారు. అసలు కేసిఆర్ మందు తాగి మాట్లాడినట్లుగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయిన ఒక జాతీయ పార్టీని కూల్చే శక్తి ఒక ప్రాంతీయ ప్రాంత పార్టీకి ఉంటుందా? అని కాంగ్రెస్ నాయుకులు ప్రశ్నించయారు. దేశం కోసం అన్నీ త్యాగం చేసి, దశ, దిశ చేసిన నెతలపై అడ్డగోలుగా, దేశ ప్రజలు అసహ్యించుకునే విధంగాను, తెలుగు ప్రజలు సిగ్గుతోనూ తలదించుకునే రీతిలో విమర్శలు చేస్తావా, అంటూ గులాబీనేత పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అగ్ని కిరణాలను కూరిపించారు. గులాబీ నేత ఎంత అరిచి గీపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఏం కాదని ఆయన అన్నారు. అసలు నీ సాయ్థి, అర్హత ఏంటో తెలుసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి హితువు పలికారు. మీ పార్టీ ఒక ప్రాంతంలో సబ్ రిజనల్ పార్టీ. ఆ పార్టీకి నీవు ఒక నాయకుడివి, ఒక్కసారి గత చర్రిత తెలుసుకోవాలని కేసిఆర్ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో మీ పార్టీ వివిధ పార్టీలతో జతకట్టి మహా కుటమి పేరుతో నీకొచ్చిన సీట్లు కేవలం 10, ఇక్కడనే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 50కి పైనే నీ నినాదం తర్వాతనే తర్వాతనే మా వాళ్లు గెలిచారు. , నీదయతోనో , నీ పార్టీ బలంతో ఎంత మాత్రం కాదు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో, నీ బాష , నీవ్యాఖ్యలు, నీ సంస్ర్కుతి, నీ ప్రవర్తనను తెలియ జేస్తున్నాయంటూ గులాబీ నేత పై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శల బాణాలు విసిరాడు. నీవు సర్కాను ఎలా పడగొడతావో అదీ చూస్తాం అంటూ సీరియన్ గా కిరణ్ కుమార్ రెడ్డి , తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గులాబీ నేతకు వార్నింగ్ ఇవ్వటం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more