తెలంగాణ కోసం పోరాటం చేసే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పు దెబ్బలు తగిలాయి. తెలంగాణ వాదులే, తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై ముష్ఠియుద్దం చేశారు. తెలంగాణ కాంగ్రెస నాయకులపై యుద్దం రాత్రి పార్కులో జరిగింది. పార్కు అంటే ఇందిరాపార్కు వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు చేదుఅనుభవం ఎదురైంది. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమరదీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఇందిరాపార్కుకు వచ్చిన సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కే కేశవరావు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, జీ వివేక్‌లను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తమ పదవులను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారిని అక్కడి నుంచి తరిమివేసేందుకు ప్రయత్నించారు. వేదిక నుంచి బయటి వరకూ నెట్టుకుంటూ వచ్చారు. వాటర్ ప్యాకెట్లు, చెప్పులు, రాళ్లు రువ్వారు. ఓ దశలో తెలంగాణవాదులపై జేఏసీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ‘మీ పోరాటం, ఆవేశంలో అర్థం ఉంది. ఎవరూ కూడా తొందర పడొద్దు. మీ బాధ అర్థమైంది. అడ్డుకోకండి’ అని కోదండరాం అన్నారు. ఇక్కడికి బడుగు, బలహీనవర్గాలకు ప్రాతినిథ్యం వహించే వాళ్లే వచ్చారని, వీరు మన టార్గెట్ కాదని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు జోక్యం చేసుకొంటూ.. తెలంగాణ కోసం ఢిల్లీలో మాట్లాడినందుకు కేకేను సీడబ్ల్యూసీ సభ్యుడిగా తీసేశారని, ఆయన రాజ్యసభ సభ్యత్వం పోయిందని గుర్తు చేశారు. మనల్ని ఆదరించేందుకు వచ్చిన అతిథులను అవమానించడం సరైంది కాదన్నారు. ‘కాంగ్రె
తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ పార్టీనేకాదు, ఏ పదవిలోనూ ఉండబోమని చెప్పారు. ఉద్యమాలకు కలిసివచ్చే వారిని రానీయక పోవడం మంచిది కాదన్నారు. తెలంగాణకు సంబంధించి ఒక్క అడుగు కూడా వెనక్కు వేసేది లేదన్నారు. మేం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తే కాంగ్రెస్‌లో తెలంగాణ కోసం ప్రశ్నించేవారు ఎవరు ఉంటారని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం లేదని తెలిసిన మరు క్షణమే పదవులను వదులుకుంటామని ఎంపీ వివేక్ చెప్పారు. కాంగ్రెస్‌లో తెలంగాణవాదులున్నారు, ద్రోహులున్నారని, అడ్డు పడుతున్న వారితోనే పోరాటం చేయాలని, వస్తున్న వారిని రమ్మని చెప్పాలని వివేక్ అన్నారు. కాగా, తను నిలదీసిన ఉద్యమకారుల ఆవేదనలో అర్థముందని కే కేశవరావు అన్నారు. ఉద్యమంలో ఉన్న వారికి ప్రశ్నించే హక్కుందని చెప్పారు. తాను మీలో ఒకడిగానే వచ్చానని, తెలంగాణకోసం మాట్లాడి పదవి కోల్పోయిన వ్యక్తిగా వచ్చానని తెలిపారు. తెలంగాణ కోసం సోనియాగాంధీ పక్కనే ఉండి ప్రశ్నించానని గుర్తు చేశారు. ‘మీరు కొట్టినా, తిట్టినా నాకేమీ ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ కోసం వెనకడుగు వేయను’ అని చెప్పారు. తెలంగాణ రాకపోతే కాంగ్రెసే కాదు ఏ పదవి కూడా అవసరం లేదన్నారు. తెలంగాణ కోసం వెయ్యి మంది చనిపోయారని, ఆ బాధ్యత కాంగ్రెస్‌కు ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more