ఎంపీ అసదుద్దీన్ కు మరోసారి చుక్కెదురైంది. నిన్న ఆయన బెయిల్ ఫిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించడంతో ఈ రోజు మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. అయితే సంగారెడ్డి న్యాయస్థానం ఆయన బెయిల్ పిటిషన్ ను ఈ రోజు కూడా తిరస్కరించింది. అసలు ఎంపీ అసదుద్దీన్ అరెస్ట్ ఎందుకు అయ్యాడు? అతన్ని పోలీసులు అరెస్ట్ చేయటానికే ముందే కోర్టులో ఎందుకు లొంగిపోయారు? ఆయన పై ఉన్న కేసు ఏమిటి? ఆ కేసు ఏప్పుడు పెట్టింది? కొత్త కేసా? లేక పాత కేసా? అనేది ఇప్పుడు ఎంఐఎం కార్యకర్తలను వేదిస్తున్న ప్రశ్నలు. అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి జైలుకు వెళ్లటంపై ఆ పార్టీ నాయకులు ఆత్మపరిశీలనం చేసుకుంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అరెస్ట్ లపై అనేక అనుమానాలు వస్తున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి.
ఎంపీ మీద కేసు ఇప్పటిది కాదట? ఏనిమిది సంవత్సరాల నాటిది? అప్పుటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో పెట్టిన కేసుకు ఎంపీ అసదుద్దీన్ ఇప్పుడు కోర్టుకు లొంగిపోయారు?అసలు విషయం ఏమిటి అంటే? వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ఉండగా 2005 ఏప్రిల్ 16న మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని ముత్తంగి గ్రామం వద్ద రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా స్థానికంగా ఉన్న అఫ్జుమా మసీదును తరలించిన సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మరో నలుగురు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు సహా 30 మందిపై కేసు నమోదైంది. మెదక్ కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్‌ను వీరంతా దుర్భాషలతో దూషించటంతో పాటు పనులను అడ్డుకున్నారంటూ పటాన్‌చెరు మండల రెవిన్యూ అధికారి పటోళ్ళ నరేందర్ రెడ్డి 2005 ఏప్రిల్ 17న ఫిర్యాదు చేయటంతో వారందరిపై 147, 153-ఎ, 353, 290, 285-ఎ, 186, 341, 504, 506 సెక్షన్ల కింద ఏప్రిల్ 20న కేసు నమోదు చేశారు.
వీరిలో ఏడునుంచి 30 వరకు ఉన్న నిందితులు కోర్టుకు హాజరు కావటంతో వారిపై నాన్‌బెయిలబుల్ వారంట్లు రద్దు చేశారు. ఎప్పుడో 2005లో నమోదైన కేసు బూజు దులిపి, ఇప్పటికే ఆదిలాబాద్ జైలులో ఉన్న అక్బరుద్దీన్‌ను ఈనెల 17న సంగారెడ్డి కోర్టుకు తీసుకు వచ్చి మెజిస్ట్రేట్ ముందు నిలిపారు. ఇక ఆయన సోదరుడు అసదుద్దీన్‌ను కోర్టులో హాజరు పరిస్తే ఫిబ్రవరి రెండు వరకు రిమాండ్ విధించారు. కేసు విషయం, తీర్పు ఎలా రానున్నదన్నది పక్కన ఉంచితే, ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారు ఏమి చేసినా, అధికారులను దూషించినా, భౌతిక దాడులకు దిగినా ఏళ్ళు గడిస్తే తప్ప, ప్రభుత్వాలు గట్టి నిర్ణయాలు తీసుకుంటే తప్ప చర్యలుం డవన్న వాస్తవం ఒవైసీ సోదరుల విషయంలో రుజువైందన్న అభిప్రాయాలు అన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉన్నందుకే ఒవైసీ సోదరులు, మజ్లిస్ ఎమ్మెల్యేల విషయంలో పోలీసులు చూసీ చూడనట్టు ఉన్నారన్న విమర్శలు సైతం వెల్లువెత్తాయి. కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండటంతో ఎంపీ అసదుద్దీన్ అరెస్ట్ ఆగిపోయిందనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు కూడా ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహితం వలన అన్నదమ్ములను వదిలేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కిరణ్ సర్కార్ మాత్రం అలా కాదని నిరూపించింది. చట్టం ముందు అందరు ఒక్కటే అని రుజువు చేశారు. అన్నదమ్ములిద్దరి మాదిరిగానే మిగిలిన మజ్లిస్ ఎమ్మెల్యేల విషయంలోనూ కచ్చితంగా వ్యవహరిస్తే చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని మరింత సమర్థంగా అమలు చేసినట్టవుతుందని రాజకీయ పార్టీల నేతలు, రాష్ట్ర ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more