నాకు అవార్డులపై ఆశలేదు. అవార్డులను ఆశించి సినిమాలు చేస్తే ఎప్పటికీ అదే పంథాలో వెళ్లాల్సివస్తుంది. అందుకే అవార్డులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయను. సినిమా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోవడానికి అదృష్టం నాకు తోడవుతోంది. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగపరచుకొని ముందుకుసాగిపోవడమే నాకు తెలుసు. జయాపజయాల గురించి ఆలోచించను. నేను విధిని బలంగా విశ్వసిస్తాను. మనకు ఏది దక్కాలో అదే దక్కుతుంది. రెండునెలలు అనారోగ్యంతో గడిపిన కాలం జీవితంలో నాకు కొత్త విషయాల్ని నేర్పింది’ అని చెప్పింది సమంత. వరుస విజయాలతో తెలుగులో అగ్రకథానాయికగా దూసుకుపోతున్న సమంతా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం గురించి అందాల తార సమంత మాట్లాడుతూ ‘నన్ను ఏ ఒక్క నటితో పోల్చవద్దు దయచేసి...ఎవరి టాలెంట్ వారిదే...నంబర్ల రేసు మీద నాకు ఏ మాత్రం ఇంట్రస్ట్ లేదు. ఇక సీతమ్మ వాకిట్లో చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌కు ఎంతో ఆనందంగా ఉంది. చాలా కాలానికి ఒక మంచి ఫ్యామిలీ చిత్రంలో నటించాననే అనుభూతి కలిగింది. అంతమంది సీనియర్లతో నటించడం కూడా చాలా తృప్తినిచ్చింది. ఈ చిత్రంలో సీతగా చేసిన అంజలి ఆల్రెడీ తమిళంలో మంచి నటి. తొలి సారి తెలుగులో స్ట్రయిట్ చిత్రంలో నటించినా ఎంతో గొప్పగా చేసింది. పాత్ర చిన్నదా...పెద్దదా అని మేమెవ్వరం చూడలేదు. బాగా చేశామా లేదా అనేదే చూసుకున్నామంతా. మహేష్, వెంకటేష్‌లే ఈ చిత్ర విజయానికి ముఖ్యకారకులు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. నా సినిమాలన్నీ విజయవంతం అవుతున్నాయంటే అందుకు వారి ఆదరణే ముఖ్యం. తమిళం కన్నా ఎక్కువగా తెలుగు చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తాను.
ఇక్కడి వాతావరణం...గౌరవం...ట్రీట్‌మెంట్ అన్నీ నాకు బాగా నచ్చాయి. అందుకే హైదరాబాద్‌కు రీసెంట్‌గా మకాం మార్చేశాను. సీతమ్మ వాకిట్లో చిత్రంలో వచ్చే క్లైమాక్స్ సన్నివేశంలో భద్రాచలం ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది నాకు. ప్రకాష్‌రాజ్ నటన సింప్లీ సూపర్బ్. ఇక నా చిత్రాలకు నేనే పెద్ద క్రిటిక్. నేను చేసే అన్ని క్యారెక్టర్లు నాకుగా నేనేవిమర్శించుకుంటుంటాను. వాస్తవానికి ‘ఏం మాయ చేశావె’లో నా క్యారెక్టర్ నాకు అంతగా నచ్చలేదు. అయినా సినిమా మాత్రం బాగా ఆడింది. బాలీవుడ్‌కు వెళ్లే యోచన ప్రస్తుతానికి లేదు. నేను చేసిన చిత్రాలలో ‘జబర్దస్త్’ చిత్రం పూర్తయ్యింది. వచ్చే నెలలో విడుదల కాబోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం కూడా తప్పక విజయవంతం అవుతుంది. ఆమె మంచి టాలెంటెడ్ దర్శకురాలు. అవార్డుల కోసం నేను ఎప్పుడూ నటించను. అవార్డుల పట్ల నాకు నమ్మకం గానీ, వ్యామోహం గానీ లేవు. అవార్డులు సాధించాలని ప్రయత్నిస్తే వాటి ధ్యాసలో కూరుకుపోతా. అది నాకిస్టం లేదు. అందుకే అవార్డ్ ఫంక్షన్లకి దూరంగా ఉంటాను. నాకు తెలిసిందల్లా బాగా అనిపించిన పాత్రల్ని చేసుకుంటూపోవడమే. మూడేళ్లలో పెళ్లి చేసుకుంటా? అయితే సినిమా హీరోను మాత్రం పెళ్లి చేసుకోని సమంత చెబుతుంది. అయితే ఈ మూడేళ్లలో ఎవరినైనా ప్రేమిస్తే వారినే పెళ్లి చేసుకుంటాను. కాకపోతే మనసుకు నచ్చిన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను. ఈ మూడు సవంత్సరాల్లో నచ్చిన వ్యక్తి కనిపించకపోతే.. తల్లిదండ్రులు చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని సమంతా అందరిని మాయ చేస్తుంది. ఈమె మాయలో పడే బాయ్ ఫ్రెండ్ ఎవరో? చూడాలి?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more