యూపీఏ ప్రభుత్వం విప్లవాత్మకమైన పథకంగా చెబుతున్న ‘నగదు బదిలీ’ నేటి నుంచి దేశవ్యాప్తంగా 20 జిల్లాల్లో ప్రారంభం కానుంది. మొదటిదశను మంగళవారం నుంచి అంటే 2013 జనవరి 1 నుంచి జిల్లాల్లో ప్రారంభిస్తోంది. పథకాల లబ్ధిదారులు నేరుగా నగదును అందుకునే హక్కు కలిగించే ఈ పథకాన్ని సరిగ్గా 18 నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగుతాయనగా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. జనవరి 1 నుంచి ప్రారంభం కాబోయే సరాసరి నగదు బదిలీ పథకం గురించి ఆర్థికమంత్రి పి చిదంబరం మాట్లాడుతూ ‘దేశంలోని మొత్తం 629 జిల్లాల్లో మొదట ఇరవై జిల్లాల్లో ఈ పథకం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది.ఫిబ్రవరి, మార్చిలలో మరో 23 జిల్లాల్లో ప్రారంభమవుతుంది. 2013 చివరి నాటికి దేశంలోని అన్ని జిల్లాల్లోను నగదు బదిలీ పథకం అమలవుతుంది ’ అని చెప్పారు. మొదట్లో ఈ పథకాన్ని జనవరి 1 నుంచి 43 జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు మాత్రం23 జిల్లాల్లోనే ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని తొలుత అయిదు జిల్లాల్లో అమలు చేయబోతున్నారు. హైదరాబాద్, తూర్పు గోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జనవరి 1 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఈ పథకం ఫిబ్రవరి నుంచి అమలవుతుంది.
ఇంతవరకు 23 సంక్షేమ పథకాలకోసం నిధుల్ని... ముఖ్యంగా విద్యా నిధుల్ని కేంద్ర ప్రభుత్వం మూడో పార్టీ ద్వారా ప్రజలకు అందిస్తోంది. ఇకపై దాదాపు రెండు లక్షల లబ్ధిదారులకు ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో ఈ నగదును జమచేస్తుంది. ‘పరిపాలనలో ఇదొక కొత్త పోకడ. నగదు సరాసరి లబ్ధిదారుడికి చేరే ‘గేమ్ ఛేంజర్’ ఇది. పథకం ప్రయోజనాలు సరాసరి వ్యక్తి పొందే విధానం ఇది’ అని ఆర్థికమంత్రి పి చిదంబరం విలేకరుల సమావేశంలో చెప్పారు. లబ్ధిదారులెవరికైనా ఆధార్ నంబర్ రాకపోతే.. వారి బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు బదిలీ చేస్తామని స్పష్టంచేశారు. తొలి దశలో రెండు లక్షల మందికి నేరుగా నగదు అందనుందని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ చెప్పారు. ఈ నగదు బదిలీ పథకం కాంగ్రెస్ కి ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more