కేసీఆర్ మంచి వక్తనే కాకుండా రాజకీయ వ్యూహకర్త కూడా. తమిళనాడులో కరుణానిధి మాదిరి తన కుటుంబ సభ్యుల్ని మెల్లిమెల్లిగా రాజకీయాల్లోకి లాగుతున్నాడు. ఇప్పటికే తన మేనల్లుడు హరీష్ రావును సిద్ధపేట స్థానానికి పరిమితం చేశారు. తరువాత కొడుకు కేటీఆర్ ని సిరిసిల్ల స్థానానికి ఫిక్స్ చేశారు. ఇఫ్పుడు మరొకరిని రాజకీయాల్లోకి తేవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. కేసీఆర్ రాజకీయాలకు తేవాలనుకున్నది ఎవర్నో కాదు తన కూతురు, తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కవితను. ఇప్పటికే కవిత వివిధ కార్యక్రమాల్లో నిత్యం ప్రజల్లో ఉంటుంది. దసరా పండుగ వస్తే కవితే రాజ్యం. ఇక ఇప్పుడు పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెస్తే ఓ పనైపోతుందని భావించి పార్లమెంట్‌కు పంపేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కవితను ఏ స్థానం నుంచి బరిలోకి దింపాలనే విషయంపై కేసీఆర్ భారీగానే కసరత్తులు మొదలు పెట్టారు గతంలో నుండే ఈమె పార్లమెంటు స్థానానికి పోటీ చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే కేసీఆర్ ఈమెను ఎక్కడి నుండి బరిలో దించితే భారీ మెజార్టీతో గెలిస్తుందనే దానిపై సర్వేలు నిర్హహించడం మొదలు పెట్టినట్లు సమాచారం. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలపై పకడ్బందిగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తొలి పోటీతోనే భారీ మెజార్జీ సాధించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు కవితకు దక్కాలని కెసిఆర్ యోచిస్తున్నట్లు సమాచారం.
నిజామాబాద్ జిల్లాలో మధుయాష్కి తెలంగాణ వాదిగా గుర్తింపు ఉండగా కవిత పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందని ఆరా తీశారు. యాష్కి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటే కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెరాస వర్గాలు ధృవీకరిస్తున్నాయి. కరీంనగర్ అయితేనే.. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా టీఆర్ఎస్ అధినేతకు టచ్‌లో ఉన్నరన్న చర్చ జరుగుతోంది. కవిత పోటీ తప్పని సరి అయితే యాష్కిని రంగారెడ్డి జిల్లాకు పంపి కవితను నిజామాబాద్ బరిలో నిలుపుతారని తెలుస్తోంది. అయితే కవితకు నిజామాబాద్ కంటే కరీంనగర్ స్థానామే మరింత కలిసి వస్తుందని అక్కడి సామాజిక పరిస్థితులు మరింత అనుకులిస్తాయని పార్టీ నేతలు సూచించినట్లు తెలిసింది. జహిరాబాద్ స్థానం సైతం సమాచారం సేకరించగా జుక్కల్ నియోజక వర్గంతో పాటు మెదక్ జిల్లాలోని నియోజక వర్గాలు సమస్యగా తయారవుతాయని ధృవీకరించుకున్నట్లు తెలిసింది. మొత్తానికి నిజామాబాద్, కరీంనగర్‌లలో ఏదో ఒక స్థానం పోటీ చేయడం ఖాయమని అందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు బలమైన నేతలు కావాలని కేసీఆర్ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తానికి కవిత పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి కేసీఆర్ వ్యూహాలు ఫలించి, కవిత పార్లమెంటులో అడుగు పెడుతుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more