వారు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న లేత మొగ్గలు. అభం.... శుభం తెలియని అమాయకులు.... బడిలోకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ.... అక్షరాలు నేర్చుకుంటున్నారు. కానీ బడే వారి పాలిట శాపం అయింది. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ నగరానికి 90 కిలోమీటర్ల దూరాన ఉన్న కనెక్టికట్ రాష్ట్రంలోని న్యూటౌన్‌లోని శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్లోకి ఓ ఉన్మాది ప్రవేశించి చిన్నారుల పై పేట్రేగిపోయాడు. శుక్రవారం ఉదయం చిన్నారులు అంతా స్కూలు చేరుకొని చక్కగా చదువుకుంటున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో రెండు తుపాకులతో చొరబడిన ఈ ఉన్మాది కనిపించిన వారి పై కనికరం లేకుండా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా 27 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనలో స్కూలు ప్రిన్సిపాల్, సైకాలజిస్ట్ సైతం మృతిచెందారని అక్కడి మీడియా సమాచారం. క్షణాల్లోనే అక్కడి వాతావరణం భయానకంగా మారిపోయింది. పిల్లలు, టీచర్లు, ఆ సమయానికి అక్కడే ఉన్న కొందరు తల్లిదండ్రులు భయంతో పరుగులు తీశారు.
అసలేం జరుగుతోందో తెలసుకునేలోపే కొందరు బుల్లెట్లకు బలైపోయారు. తమ చిన్నారులను పొదివి పట్టుకుని, భయం భయంగా బడి నుంచి బయటికి వస్తున్న తల్లిదండ్రులు అనేకమంది కనిపించారు. అయితే కాల్పులు జరిపింది ఒక్కరా ఇద్దరా అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఓ దుండగడు మాత్రం చనిపోయినట్లు సమాచారం. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను స్కూలు నుంచి ఖాళీ చేయించి పక్కనున్న పార్కింగ్ స్థలంలోకి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా న్యూటౌన్‌లోని స్కూళ్లన్నింటినీ మూసేశామన్నారు. దుండగుడి కాల్పులతో భీతావహులైన విద్యార్థులు ప్రాణభయంతో ఏడుస్తూ బయటకు వస్తున్న దృశ్యాలను టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. ఈ స్కూల్లో కేజీ నుంచి నాలుగో గ్రేడ్ వరకూ ఐదు నుంచి పదేళ్ల వయసు విద్యార్థులు మొత్తం 600 మంది ఉన్నారు. అయితే మొత్తం చనిపోయింది ఇంత మందేనా ? లేక ఎక్కువగా ఉన్నారనే విషయం తెలియరావాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more