Azharuddin vs navjot singh sidhu in gujarat poll campaign

Azharuddin Vs Navjot Singh Sidhu,Azharuddin,Navjot Singh Sidhu, Gujarat Poll Campaign, congress party azharuddin, bjp navjot singh sidhu, azharuddin vs sidhu, gujarat government, gujarat election, 2012 gujarat election, narendra modi,

Azharuddin Vs Navjot Singh Sidhu in Gujarat Poll Campaign

Azharuddin.gif

Posted: 12/11/2012 04:03 PM IST
Azharuddin vs navjot singh sidhu in gujarat poll campaign

Azharuddin Vs Navjot Singh Sidhu in Gujarat Poll Campaign

ఈ ఇద్దరు దేశ పరువు కోసం, దేశ పేరు కోసం మైదానంలో రెచ్చిపోయి భారతదేశానికి కీర్తి సంపాదించి పెట్టారు. కానీ ఇప్పుడు విడిపోయి కొట్టుకుంటున్నారు. ఈ ఇద్దరు మంచి క్రికెటర్లు. కానీ ఇప్పుడు  ఇద్దరు మారిపోయారు. ఒకరంటే ఒకరి కోపం, ఒక మీద ఒకరు విమర్శలు చేసుకొనే పనిలో ఉన్నారు.   ఒకరు కాంగ్రెస్ పార్టీ , మరొకరు బీజేపి పార్టీ?  ఒక దేశం కోసం ఆడిన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకే దేశం లో రెండు వర్గాలుగా విడిపోయారు. రెండు రాజకీయ పార్టీలో చేరి .. విమర్శలు చేసుకొనే స్థాయి ఎదిగిపోయారు. ఈ ఇద్దరు క్రికెటర్లుగా ఉన్నప్పుడు ప్రపంచమంత అభిమానులు ఉన్నారు. ఇప్పుడు  ఆయా పార్టీల్లోనే అభిమానులు ఉన్నారు. ఈ ఇద్దరు ఇప్పుడు గుజరాత్ లో పోటీ పడుతున్నారు. తొలిదశ పోలింగ్‌కు గుజరాత్‌ సిద్ధమవుతోంది. ప్రచారం క్లైమాక్స్‌కు చేరడంతో.. స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. ఒకప్పుడు దేశం కోసం కలిసి ఆడిన క్రికెటర్లు.. ఇప్పుడు పార్టీల కోసం ప్రత్యర్థులుగా మారిపోయారు. గుజరాతీలను ఎంటర్‌టైన్‌ చేశారు. అజరుద్దీన్. క్రికెట్‌లో మణికట్టు మాంత్రికుడు. సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌. ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున మొరాదాబాద్ ఎంపీ.నవ్‌జ్యోత్‌ సిద్ధూ. క్రికెటర్‌గా, వ్యాఖ్యాతగా పాపులర్. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు వరుసగా ఎన్నికైన మాస్‌ లీడర్. వీళ్లిద్దరూ ఇప్పుడు గుజరాత్‌ వేదికగా తలపడుతున్నారు. తమ సొంత పార్టీల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. మోడీని ప్రశంసలతో ముంచెత్తిన సిద్ధూ.. భారత్‌ను బంగారు పక్షిగా మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లినా.. గుజరాతీలు మాత్రం తమ పిల్లలు మోడీలా కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఇటు.. జామ్‌నగర్‌లో అజరుద్దీన్‌ దూసుకెళ్లారు. సభలు నిర్వహించకపోయినా.. రోడ్‌షోలతో మాస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు గ్రౌండ్‌లో షాట్లు కొట్టి మ్యాచ్‌లు గెలిపించిన వీళ్లిద్దరూ.. ఎన్నికల ప్రచార బరిలో ఎవరి దూకుడు ఫలిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna writes open letter to purandeswari
Rahul gandhi to play important role soon pc chacko  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more