ఎలక్షన్ సమయం తగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకులు మద్య మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎవరికి వారే ప్రత్యక్ష రాజకీయాలు చేస్తున్నారు. తమ ప్రత్యర్థులపై ఇప్పటి నుండి కన్ను వేసినట్లు తెలుస్తోంది. వివాదాలకు నిలయం అయిన విజయవాడ మళ్లీ మీడియాలోకి ఎక్కింది. ఒక వీడియో వివాదంలో రెండు గ్రూపులు రోడ్డు మీదకు వచ్చాయి. వల్లభనేని వంశీమోహన్, దేవినేని నెహ్రు వర్గీయుల మధ్య మరోసారి వార్ మొదలయింది. పోలీసు స్టేషన్ వరకూ వివాదం వెళ్లింది. వంశీమోహన్ దేవినేని అనుచరులపై కేసు పెట్టారు. దీంతో నగర పోలీసు యంత్రాంగం ఎలర్ట్ అయింది. బెజవాడలో తెలుగుతమ్ముళ్ల విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి. అర్బన్ అధ్యక్షులు వల్లభనేని వంశీమోహన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని నెహ్రు వర్గీయులు మరోసారి ఢీకొంటున్నారు. విజయవాడ గుణదల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఇరువర్గాల మధ్యా తాజా వివాదాలకు కారణమయ్యింది. గుణదలు పార్టీఆఫీసు ప్రారంభోత్సవాన్ని వల్లభనేని వంశీమోహన్ దగ్గరుండి నడిపించారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఓ అపరిచిత వ్యక్తి వీడియో చిత్రీకరించడం వివాదానికి కారణమైంది. వల్లభనేని వంశీ, బోండా ఉమామహేశ్వరరావులు ఆ వీడియోగ్రాఫర్ని పిలిచి నిన్ను ఎవరు వీడియోతో తీయమన్నారని ప్రశ్నించారు.. దీంతో పసుపులేటి రమేష్ అనే ఆ వ్యక్తి తనను నెహ్రు ప్రధాన అనుచరుడు అరవ సత్యం పంపించాడని చెప్పాడు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఎన్నో కేసులతో సంబంధం ఉన్న అరవ సత్యం ఏదో లక్ష్యంతో ఈవిధంగా చేస్తున్నాడని ఆరోపించారు. వివాదానికి కేంద్ర బిందువయిన అరవ సత్యం గుణదల ప్రాంతంలో అరాచకాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు తక్షణమే స్పందించాలని వారు కోరారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో విజయవాడ నగరంలో పోలీసులు మరోసారి ఎలర్ట్ అయ్యారు. వంశీమోహన్, దేవినేని నెహ్రు వర్గీయుల కదలికలపై కన్నేశారు. ఇప్పుడు ఈ వీడియో వివాదంతో రెండు వర్గాలు కక్ష సాధింపు చర్యలో ఉన్నారు. వీడియో వివాదం బెజవాడ ప్రజలు ఆందోళన చెందున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో విజయవాడ ప్రజలు ఉన్నారు. అయితే వంశీ అయ్యప్పమాల ధరించి ఉండటంతో.. పోలీసులు వివాదాన్ని సులభంగా తీర్చారు. దీంతో విజయవాడ ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more