ప్రధాని మంత్రి సీఎంల మద్య మాటల యుద్దం జరిగింది. ఆ సీఎంను ఓడించండి అని ప్రధాన మంత్రి స్వయంగా చెప్పటం విశేషం. సీఎం కూడా ప్రధాన మంత్రి మన్మోహన్ పై ఎదురు దాడి చేసినట్లు తెలుస్తోంది. మన దేశ ప్రదాని మంత్రి మన్మోహన్ పై మాటల యుద్దం చేసింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాదులేండి? ప్రదానీ పై మాటలతో ఎదురు దాడి చేసింది గుజరాత్ ముఖ్మమంత్రి నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పార్టీ వార్సెస్ బీజేపి పార్టీలు మాటల యుద్దం చేసుకున్నాయి. ప్రధాని మంత్రి గుజరాత్ ప్రజలకుపిలుపునిచ్చారు. వేర్పాటు రాజకీయాలకు పాల్పడే రాజకీయ నాయకుల్ని ఓడించమని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రతిపక్షాల మాదిరి మేము సమాజాన్ని విభజించే రాజకీయాలకు పాల్పడడం లేదని ప్రధాని అన్నారు. అలాంటి రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకి ఎంతో కాలం ప్రయోజనం కలిగించవని ప్రధాని చెప్పారు. అంతేకాకుండా గుజరాత్ కు అలాంటి రాజకీయాల నుంచి ప్రజలు విముక్తి పొందాలని ఆయన కోరారు. మన సమాజాన్ని, దేశాన్ని విభజించి, ఓట్లు పొందాలని ప్రయత్నించే అలాంటి వారు అధికారంలోకి రాకుండా చూడండని గుజరాత్ ప్రజలను ఆయన కోరారు. సమాజంలో బలహీన వర్గాలు, మైనారీటలపై గుజరాత్ ప్రభుత్వం శ్రద్ద వహించడం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. ప్రధాన మంత్రి – మహాత్మ గాంధఈ నడయాడిన ఈ రాష్ట్రం నుండి అనేక ఫిర్యాదులు రావటం చాలా బాధకారం అని ఆయన వక్తం చేశారు.
గుజరాత్ రాష్ట్రంలో ప్రజారోగ్య రంగం సరిగాలేదని, యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా రావడంలేదని మన్మోహన్ సింగ్ విమర్శలు చేశారు. గుజరాత్ లో అభివ్రుద్ది ఏ కొద్ది మందికో పరిమితమైందని , జనాభాలో ఎక్కువ భాగం ఆర్థికాబివ్రుద్ది ఫలాలు అందడంలేదని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు. మైనారిటీ, మెజారిటీ సామాజిక వర్గాల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా దేశ ప్రధాని వ్యవహరించలేకపోవడం విచారకరం అని నరేంద్రమోడీ అన్నారు. గుజరాత్ మైనారిటీలు, మెజారిటీ వర్గాలు అన్న తేడాల లేదని చెప్పారు. రాష్ట్రంలో మైనారిటీలు అభద్రతాభావంతో ఉన్నారని ప్రధాని చెప్పారు. కానీ అది సరికాదు. గుజరాత్ లో వారూ వీరు అన్నా తేడా లేకుండా ఆరు కోట్ల మంది ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కష్టపడుతుంది. ప్రధాని మంత్రి గారు అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరు నెలల కిందట మీ సోంత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఊచకోత జరిగిందన్న సంగతి దేశంలో అందరికి తెలుసు. అస్సాంలో అప్పుడు జిల్లాలకు జిల్లాలే మతపరమైన హింసాకాండకు ఆహుతయ్యాయి. గత పదేళ్లుగా గుజరాత్ లో మతకలహాలనేవే లేవు. అంతేకాకుండా మైనారిటీల భద్రత గురించి ఒక ఉదాహరణ చెప్పారు. ఇటీవల స్వర్గీయ బాల్ థాకారేపై పేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలకు షాహిన్ దాదా అనే అమ్మాయిని మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. తర్వాత ఆమె తన కుటుంబంతో సహా గుజరాత్ తరలివచ్చారు. ఇప్పుడామె మహారాష్ట్రలో కన్నా గుజరాత్ లో నివసించేందుకే ఆమె ఇష్టపడతున్నారు. ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ , షాహిన్ లాంటి అమ్మాయిలు మీరు చెప్పేది తప్పని నిరూపించారు. పై విదంగా పీఎం సీఎం ల మద్య మాటల యుద్దం జరింగింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more