దశాబ్దానికి పైగా గడిచిన కాలాన్ని పరిశీలించినప్పుడు గుజరాత్ రాజకీయాలు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి నరేంద్రమోడీ చుట్టూ తిరుగుతున్నాయని ఎవరైనా ఇట్టే చెబుతారు. మోడీతో ముడిపడి ఉన్నాయి. ఇంక కొన్ని వారాల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగబో తున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉన్నట్టు కనబడుతోంది. 2001 అక్టోబర్ నుంచీ మోడీ గుజరాత్‌ను పాలించడమే కాదు, శాసిస్తున్నారనే చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ దాదాపు నేలమట్టం చేశారనవచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఆయనను సవాల్ చేసే నాయకుడు లేడంటే మోడీ రాష్ట్రాన్ని ఎంతగా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఎన్నికల్లో కూడా విజయం ఆయననే వరిస్తుందంటున్నారు. ఈసారి విజయంతో నరేంద్రమోడీ హ్యాట్రిక్ సాధించినట్టవుతుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రతిపక్షాన్ని చుట్టచుట్టి పడుకోబెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ను మట్టికరిపించారనే చెప్పాలి. 2012 దృశ్యం కూడా అలాగే కనబడుతోంది. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సిఎస్‌డిఎస్) సిఎన్‌ఎన్- ఐబిఎన్ ఛానల్‌కోసం ఎన్నికల ముందు చేసిన సర్వే ఫలితాలను బట్టి చూస్తే మోడీ ఈసారి కాంగ్రెస్‌కు ఉనికి లేకుండా చేస్తారని, ఘన విజయం తథ్యమని తెలుస్తోంది. గుజరాత్‌లో 3658 మంది ఓటర్లను ప్రశ్నించినప్పుడు వారిలో దాదాపు 50 శాతం మంది భారతీయ జనతాపార్టీకి అనుకూలంగా ఉన్నారని తెలిసింది. కాంగ్రెస్ బీజేపీ కన్నా చాలా వెనకబడి ఉంది. కేవలం 36 శాతం మంది మాత్రమే కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడారు.
ఒక్కసారి గతాన్ని పరికిస్తే - 2002లో గుజరాత్ అంతటా అల్లర్లు జరిగినప్పటికీ బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిందంటే అది మోడీ వల్లనే అని చెప్పాలి. ఆనాడు 37 శాతం మంది ఓటర్లు మాత్రమే మోడీ ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. అప్పటి నుంచీ, 2004లో తప్ప (ఆనాడు ఆయనకున్న ప్రజాదరణ 31 శాతానికి పడిపోయింది. అయినా ఆయన తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. ఇక ఇప్పుడు 2012లో ఆయన సమీపానికి రాగల నాయకుడే లేరు.నరేంద్ర మోడీ ఇంతలా ఎదగడానికి కారణమేమిటి? ఇంతగా రాష్ట్రాన్ని ఎలా ప్రభావితం చేయగలిగారు? అన్నది ఆలోచించినప్పుడు - ఆయన సారథ్యంలో గుజరాత్ ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధిని సాధించింది. రాష్ట్రం ఇంతగా అభివృద్ధి సాధించడానికి బీజేపీనే కారణమని మెజారిటీ ఓటర్లంటారు. అభివృద్ధి లక్ష్యంగానే మోడీ పాలన సాగిందని బీజేపీయేతర, కాంగ్రెసేతర ఓటర్లు సైతం విశ్వసిస్తారు. మోడీకి ఉన్న ట్రాక్ రికార్డులో ఒక్కటే మచ్చ ఏమిటంటే రైతుల పరిస్థితి, ఉద్యోగ కల్పన అంశాల్లో సర్వేలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి.సంతృప్తికరమైన పరిపాలన విషయానికి వస్తే బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్ రమణ్‌సింగ్, ఒడిశా నవీన్ పట్నాయక్ కంటే ఎక్కువ మార్కులు సాధించలేక పోయారు. కానీ, మోడీ మాటలకు 43 శాతం ఓటర్లు తలవొగ్గుతున్నారు. ఆయనవల్లే గుజరాత్ గౌరవం పెరిగిందని 67శాతం ప్రజలు విశ్వసిస్తున్నారు. మోడీకి ఇంత అనుకూలత ఉన్నా, సర్వేలో తేలిన కాస్త కలవర పరిచే అంశం ఏమిటంటే, అయిదేళ్ల కిందట ఉన్న మతపరమైన శాంతి పట్ల హిందువులు, ముస్లింలు కూడా ఆశాభావంతో లేరు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more