ఇప్పుడు కేసిఆర్ మనసును ఒక సమస్య తొలచివేస్తుందట. ఆ సమస్య ఏ నిర్ణయం తీసుకోవాలో తేలియాక కేసిఆర్ డైలమాలో పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ సమస్య కంటే కొత్త సమస్యతో కేసిఆర్ కు తలనొప్పిపుడుతుందట. ఆయన మాత్రం ఆ విందుకు వెళ్లి మంచిగా పప్పు భోజనం చేసి రావలని ఉందట. కానీ తెలంగాణ నాయకులు, ప్రజలు ఏమనుకుంటారోనని ఆయన మథనపడిపోతున్నారట. కేసిఆర్ ను సమస్య వలయంలో నెట్టిన సమస్య ఏమిటి అంటే? బొత్స వారి పెండ్లి పిలుపు. బొత్స సత్యనారాయణ కూతురి పెళ్లికి కేసిఆర్ ను ఆహ్వనించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పెళ్లికి వెళ్లాలా వద్దా అని కేసిఆర్ డైలమా లో పడినట్లు తెలుస్తోంది. బొత్స వారి పెండ్లి పిలుపు కార్డు రాష్ట్రంలో ప్రముఖులందరి ఇళ్లల్లోనూ వచ్చి చేరింది.ఆయన సుపుత్రిక సత్యశ్రీ అనూషను విశాఖ పట్టణం వాస్తవ్యుడు డాక్టర్ భరత్ కుమార్ కిచ్చి వివాహం జరిపించడానికి నిశ్చయమైంది.ఈ పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించి చక్కటి విందుభోజనం ఆరగించి తమను ఆనందింప చేయాల్సిందిగా బొత్స దంపతులు ఆహ్వానించారు. పెళ్లికి పిలిస్తే వెళ్లి నాలుగక్షింతలు వేసి..శుభ్రంగా పప్పు భోజనం చేసి రాక డైలమాలేంటీ అనేయకండి.పాపం కేసీఆర్ కుండే చీకాకులు ఆయనకుంటాయి మరి. ఎవరికి సమస్య వచ్చినా..సంతోషం వచ్చినా మీడియాకు వార్తే. అందుకే కేసీఆర్ ను కలిసిన మీడియా ప్రతినిథులు ఏం సార్ పెళ్లికెప్పుడెళ్తున్నారు అని అడిగారు. దానికి కేసీఆర్ ఒక్క క్షణం ఆలోచించి పార్టీలో చర్చజరుగుతుందని చెప్పారు.
పెళ్లి పార్టీకి వెళ్లాలా వద్దా అన్నది పార్టీ నిర్ణయిస్తుందని కేసీఆర్ ఇచ్చిన సమాదానంతో ఆశ్చర్యపోవడం జర్నలిస్టుల వంతైంది. ప్రైవేటు పెళ్లికి వెళ్లడానిక్కూడా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా అన్నది ఇక్కడ తెలియని విషయం. అయితే పెళ్లికెళ్తే తెలంగాణా వాదులు ఏమనుకుంటారో ఏమోనని కేసీఆర్ లోలోన మధన పడుతున్నారట. తెలంగాణా వాదులు పెళ్లిళ్లకు కూడా వ్యతిరేకమా అనేయకండి. ఇక్కడ సీన్ వేరు. తెలంగాణా ప్రాంతంలో ఎవరి పెళ్లయినా కేసీఆర్ ఆలోచించేవారే కాదు. హ్యాపీగా సతీ సమేతంగా వెళ్ళి వారిచ్చే భోజన తాంబూలాదులను స్వీకరించే వారు. కానీ ఇక్కడ జరుగుతోన్న పెళ్లి వేరు. బొత్స కూతురి పెళ్లంటే...సీమాంధ్రకు చెందిన నేత కూతురు. బోత్స తెలంగాణకు సానుకూలంగా మాట్లాడుతున్నట్లు కనిపించినా అయినా ఆయన చుట్టూ ఉండే తెలంగాణా రాకుండా అడుగడుగునా అడ్డుపడుతోన్నవారే. సీమాంధ్ర నేతల ఇళ్లల్లో జరుగుతోన్న పెళ్లి. అది కూడా తెలంగాణాను నానుస్తోన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఇంట్లో విందు అది. అందులోనూ కేసీఆర్ పూర్వీకులది బొత్స కు చెందిన విజయనగరం జిల్లాయేనంటూ తెలుగుదేశం నేతలు పదేపదే కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పెళ్లికి వెళ్లి నాలుగు అక్షింతలు జల్లితే నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలు తన నెత్తిన అక్షింతలు వేస్తారేమోనని కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు ఆయన చెవులు కొరికేశారట.ముందు పెళ్లికి వెళ్లాలనే అనుకున్న కేసీఆర్ కు సన్నిహితులు అప్రమత్తం చేయడంతోనే ఇపుడు ఆలోచనలో పడ్డారట. అయితే మరో ఆలోచన కేసిఆర్ వచ్చినట్లు తెలిసింది. తన తరుపున ఎవరైన పెళ్లికి పంపిస్తే సరిపోతుంది అని కేసిఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోందట. అయితే ఆ పెళ్లికి ఎవరు అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ , ఇప్పుడు మాత్రం కేసీఆర్ తరపున ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితలు హాజరకానున్నట్టు తెలిసింది. బొత్స కూతురు వివాహం శుక్రవారం విజయనగరంలో జరుగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more