తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడు చేపట్టిన ‘వస్తున్నా .. మీ కోసం’ పాదయాత్ర నేటితో 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. చంద్రబాబు నాయకుడు 29 రోజుల్లో మూడు జిల్లాల్లో పాదయాత్ర విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో 192 గ్రామాల్లో బాబు పాదయాత్ర సాగింది. చంద్రబాబు పాదయాత్ర ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చేరేటప్పటికీ 500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. అయితే మహబూబ్ నగర్ జిల్లా పాదయాత్రలో భాగంగా గద్వాల్ సమావేశ ప్రాంగణం కూప్పకూలడంతో బాబుకి స్వల్ప గాయాలుకావడంతో పాటు వెన్ను నొప్పితో ఆయన తీవ్రంగా భాదపడిన విషయం తెలిసిందే. దీంతో ఒక రోజు పాటు వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర వాయిదాపడిన విషయం తెలిసిందే. బాబు విశ్రాంతి తీసుకోవాలని అటు డాక్టర్లు, అటు కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు ఎంత వారించినా ఆయన తన పాదయాత్రను ముందుకు సాగించడం జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది. బాబుకు వస్తున్నా.. మీకోసం పాదయాత్రతో వస్తున్న ప్రజాదరణతో కుటుంబ సభ్యుల్లో కూడా నూతన ఉత్సాహం కలిగిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్ర ఇప్పుడు అనంతపురం జిల్లాలో జరుగుతుంది. షర్మిల పాదయాత్ర ఇప్పటికి 13 పూర్తిచేసుకొని 176.30 కిలోమీటర్లు పూర్తి చేశారు. చంద్రబాబు 9 రోజుల్లోనే 111 కిలో మీటర్లు నడిచి రికార్డు సంపాదించారు. 60 సంవత్సరాలు దాటిన చంద్రబాబు ఇంత వేగం నడవటం చాలా ఆశ్చర్యంగా ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. కేవలం 29 రోజుల్లో బాబు 500 కిలో మీటర్లు పాదయాత్ర చేయటం పై పార్టీ నాయకులు, ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more