Megastar chiranjeevi new record in congress party

megastar chiranjeevi new record in congress party ,Megastar K Chiranjeevi, Megastar new record, ex-PRP leader, Congress MP and Megastar, Chiranjeevi minister,

megastar chiranjeevi new record in congress party

record.gif

Posted: 10/29/2012 07:10 PM IST
Megastar chiranjeevi new record in congress party

megastar chiranjeevi new  record in congress party

చరిత్రలో  నిలిచిపోయే రికార్డు ను మెగా స్టార్ చిరంజీవి గారు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు సాధించలేని  రికార్డును మంత్రి చిరంజీవి గారు సాధించారు.  అతి తక్కువ టైమ్ లో రాజకీయం నాయకుడుగా ఆయన ఎదిగిన తీరు చరిత్రలో చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సినీ రంగంలో మెగా స్టార్ గా వెలిగిన చిరంజీవి గారు  రాజకీయ రంగంలో  కొత్త రికార్టులు స్రుష్టించారు. తన పార్టీతో  ఆపదలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆదుకున్న ఆపద్బాంధవుడు చిరంజీవి. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను  తట్టుకొని నిలబడిన వ్యక్తి చిరంజీవి. తక్కువ సమయంలో తన స్వయంకృషితో  కాంగ్రెస్ పార్టీ లో మెగా స్థానం సంపాదించారు.  ఆయన సామాజిక సేవ చెయ్యలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి  రావటంత జరిగింది. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం స్థాపించి అన్ని పార్టీలకు బెదురు పుట్టించిన ఘనత చిరంజీవి గారిదే. ఆయన పట్టుదల , దీక్ష, స్వయంకృషి, వాటిని గుర్తించిన కాంగ్రెస్  ఆయన కు పెద్ద పీట వేయటం జరిగింది.

megastar chiranjeevi new  record in congress party

చిరంజీవి రాజకీ య చదరంగంలో మరో మెట్టు ఎక్కారు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిరంజీవి ఇక కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లో తన సత్తా చూపబోతున్నారు. సామాజిక ప్రజాసేవ నుంచి రాజకీయ ప్రజాసేవ చేసేందుకు వచ్చిన చిరంజీవి అతి తక్కువ కాలంలోనే కీలక స్థానానికి వెళ్ళగలిగారు. నేరుగా కేంద్రంలో స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవిని పొందారు. ఆయన రాజకీయరంగ ప్రవేశానికి పదేళ్ల ముందు నుంచే తనకున్న అసంఖ్యాక సినీ అభిమానలోకాన్ని ప్రజలకు, సమాజానికి ఉపయోగించడానికి పలు కార్యక్రమాలు ప్రారంభించారు. అక్టోబర్ 2, 1998న గాంధీ జయంతిని పురస్కరించుకుని చిరంజీవి తన పేరుమీదే ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్టు’ స్థాపించారు. ట్రస్టు ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్‌బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్‌ను నెలకొల్పారు. ఈ రెండు సంస్థలు రాష్ట్రంలోనే అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా గుర్తింపును పొందాయి.

megastar chiranjeevi new  record in congress party

ఈ నేపథ్యంలోనే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా 2007 నుంచే మీడియాలో విరివిగా వార్తలు రావడం మొదలైంది. దీంతో అన్ని రాజకీయ పార్టీల్లో చర్చలు మొదలయ్యాయి. చిరంజీవిని తమవైపు తెచ్చుకునేందుకు దాదాపు అన్ని పార్టీలు ప్రయత్నించాయి. అయితే చివరికి చిరంజీవే స్వయంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్లుగా తర్వాత క్లారిటీ రావడంతో రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు మెగాస్టార్ వస్తున్నట్లు గా ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆ తరువాత 2008 ఆగస్టు 17న తన కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. సెప్టెంబర్ 26న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఉందని, అన్నీ అక్కడే వెల్లడిస్తానని చెప్పారు. దీంతో రాష్ట్రం మొత్తం చిరంజీవి గాలి మొదలైంది. మదర్‌థెరిస్సా జయంతి సందర్భంగా 26న తిరుపతిలోని ఆవిలాల చెరువు మైదానంలో లక్షలాది మంది జన సమూహం మధ్య రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు, దాని పేరు ప్రజారాజ్యమని, సామాజిక న్యాయమే ఎజెండాగా పార్టీ నడక కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన అంశాలపై దృష్టిపెట్టిన చిరంజీవి ముందుగా తెల్లవారుజామునే చేనేత ఆత్మహత్యలకు నెలవైన సిరిసిల్లకు బయలుదేరి వెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రజల చూపంతా చిరంజీవి వైపే మళ్లింది.

megastar chiranjeevi new  record in congress party

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన వెంటనే చిరంజీవి ప్రజలతో మమేకం అయ్యేందుకు ఏమాత్రం జాప్యం చేయలేదు. అనేక సమస్యలున్నాయని గుర్తించిన చిరంజీవి పని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం నుంచి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు. ఆ యాత్ర ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానంలో మరువలేనిది. ఎక్కడికెళ్లినా ప్రజాసమూహాలే. తిరుపతి మీటింగ్‌లో చిరంజీవి- ‘నాకు డబ్బులొద్దు. నేను గంజిని చూశాను. బెంజిని చూశాను. ప్రజల సొమ్ము కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రేమే మార్గం.. సేవే లక్ష్యం’ అంటూ తన రాజకీయ పంథాను స్పష్టం చేయడంతో ఎంతోమంది ఆకర్షితులై చిరంజీవి వెంట నడిచేందుకు ముందుకొచ్చారు. నవ తెలంగాణ ప్రజాపార్టీ పెట్టిన దేవేందర్‌గౌడ్ దాన్ని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. ఆ తరువాత కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలోని మన పార్టీ ఎంతో కృషి చేసి 2009 లో ప్రజారాజ్యంతో పొత్తుపెట్టుకుంది. చిరంజీవి హవా చూసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో వణుకు మొదలైంది. ఏ జిల్లాలో ఏ సమస్య ఉందో పూర్తిగా కూలంకుశంగా తెలుసుకున్నాక చిరంజీవి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు ప్రజారాజ్యం పార్టీ రూపొందించుకున్న మేనిఫెస్టో ఇతర పార్టీలను కలవరపరిచింది. పూర్తిగా ప్రజల కోసం.. ప్రజల పక్షాన రూపొదించినట్లున్న మేనిఫెస్టో ఎంతో ఆకర్షించింది.

 megastar chiranjeevi new  record in congress party                      

పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రజారాజ్యం ఇతర రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. మూడో ప్రత్యామ్నాయంగా మొదలైన ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో భారీ విజయం సాధించనప్పటికీ తీవ్ర ప్రభావాన్నే చూపింది. దాదాపు 18 శాతం మేర ఓట్ల వాటా పొందింది. దాదాపు 80 లక్షల ఓట్లను ప్రజారాజ్యం పార్టీ సాధించుకుంది. దీనంతటికీ కారణం చిరంజీవి చరిష్మా అనేది చెప్పనవసరం లేదు. ప్రజారాజ్యం ప్రభావం వల్ల తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రవూపాంతాల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ కొన్ని నెలలపాటు ప్రజారాజ్యంపై దుమ్మెత్తిపోసింది. తమపై విమర్శలు చేసే కంటే ముందు ప్రజల్లో పార్టీకి, చంద్రబాబుకు విశ్వసనీయతను పెంచుకునేందుకు సమయం కేటాయించాలని గట్టిగానే చెప్పారు. తదనంతర కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి మరణించడం, కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పెరగడం, ఢిల్లీ అధిష్ఠానం నుంచి పిలుపు మేరకు కలిసి పనిచేద్దామనే ఆహ్వానం రావడంతో చిరంజీవి 2011లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. చిరంజీవి లేకుంటే రాష్ట్రం ఇప్పటికే మరోసారి మధ్యంతర ఎన్నికలను చవిచూసేదని రాజకీయ పరిశీలకులు అభివూపాయపడుతుంటారు.

megastar chiranjeevi new  record in congress party

వైఎస్ మరణం తరువాత పార్టీలో, ప్రభుత్వంలో పెరుగుతు న్న విభేదాలను, అసంతృప్తిని నివారించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆహ్వానం మేరకే చిరంజీవి ఆ పార్టీలో విలీనం అయ్యా రు. వైఎస్ తరువాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజల్లో చరిష్మా ఉన్నవారు లేకపోయారు. చిరంజీవి నిర్వహించిన ప్రజా అంకిత యాత్రలో లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొనడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం గమనించింది. చిరంజీవికొచ్చే చరిష్మాను వాడుకుంటే, దాన్ని ఓట్లుగా మలచుకునే యంత్రాగం పార్టీకుంది కనుక కాం గ్రెస్ లబ్ధి పొందుతుందని, బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. రాబోయే రోజుల్లో ఆయనను పార్టీకి లీడర్‌ను చేయాల నే ఉద్దేశంతోనే చిరంజీవి పార్టీని విలీనం చేసుకున్నట్లుగా రాజకీ య పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో చిరంజీవికి ఉన్నత స్థానం దక్కడం ఏమంత ప్రత్యేక అంశం కాదని, ఢిల్లీ పెద్దలు ఆయనతో ప్రతిరోజూ టచ్‌లో ఉంటారని కాంగ్రెస్ నేతలే అంటుంటా రు. రాష్ట్రానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చిరంజీవిని సంప్రదించిన తరువాతే ఢిల్లీ పెద్దలు అడుగు ముందుకు వేస్తారని నేతలంటున్నారు. చిరంజీవి అడిగిన వెంటనే ఆయనకు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ ఇస్తారని, ఇంతకంటే ఆయన ప్రత్యేకతకు వేరే నిదర్శనమేం కావాలని ఆయన అభిమానులు అంటుంటారు. ఇప్పుడు తమ నేతకు కేంద్ర మంత్రి పదవి రావడంపట్ల వారు సంబరపడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా కేంద్రంలో మంత్రి పదవి పొందాలనే లక్ష్యంగా రాజకీయం చేస్తారు. కానీ చిరంజీవికి కేంద్రమే పిలిచి మంత్రి పదవిని ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. రాష్ట్రంలో ఉన్న నేతలందరికంటే చిరంజీవి గురించి, ఆయన నిజాయితీ గురించి ఢిల్లీ పెద్దలకు తెలుసుకనుకే ఆయనను వారు గౌరవిస్తారని కాంగ్రెస్ నేతలే అంటుంటారు. ఎంతోమంది కాకలు తీరిన నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నా.. వారిని కాదని చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వడం అంటే ఢిల్లీ పెద్దలు చిరంజీవిని ఏ విధంగా గౌరవిస్తారో అర్థం చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలంటున్నారు. అతి త్వరలోనే చిరంజీవి మరిన్ని శిఖరాలు అధిరోహించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎంతో కిందిస్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన చిరంజీవి వెంట ప్రతి సందర్భంలోనూ అభిమానులున్నారు. చిరంజీవి మంత్రిగా ప్రమాణం చేయడంతోనే రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minority scam cid investigation on celebrities
Cabinet minister revenge on cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more