ఈ మద్య కాలంలో సీఎం కిరణ్ నోటి దురుసు తనం బాగా కనిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పదవులేని నాయకులను కిరణ్ చిన్న చూపు చూస్తున్నారనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. కొత్త కేంద్ర మంత్రులైన వారితోనూ మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాస్త అటూఇటుగా ఇలాగే మాట్లాడారు. 'కేంద్ర కేబినెట్ కార్యదర్శి నుంచి ఫోన్ వచ్చింది' అని వారు చెప్పినప్పటికీ... 'కేంద్ర మంత్రిపదవి అంటే ఆషామాషీ అనుకున్నారా! నిన్ను ఎవరో ఆటపట్టిస్తున్నట్లున్నారు. అవన్నీ నమ్మొద్దు' అంటూ వారి ఉత్సాహం మీద చల్లనీళ్లు చల్లారు. అంటే... రాష్ట్రం నుంచి ఎవరు కేంద్ర మంత్రులవుతున్నారో ముఖ్యమంత్రికే తెలియదన్నమాట! కిరణ్‌తో మాటమాత్రమైన చెప్పకుండా, సంప్రదించకుండా అధిష్ఠానం ఆయనకు ఝలక్ ఇచ్చిందన్నమాట! ఇంకా ఎవరెవరికి మంత్రిపదవులు వస్తున్నదీ ఒక్కరోజు ముందుదాకా... సీఎంకూ తెలియకపోవడమే ఇక్కడ అసలైన వార్త.
అధినేత్రి సోనియాగాంధీ, అటు యువనేత రాహుల్‌గాంధీ స్వయంగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్న ఆ విషయం చెప్పి అభినందించారు. అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటంటే... కేంద్ర కేబినెట్ కార్యదర్శి నాలుగు రోజుల ముందుగానే ఆయా ఎంపీలకు ఫోన్ చేసి, 'ఈ నెల 28న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. 27వ తేదీ నాటికి మీరు ఢిల్లీలో అందుబాటులో ఉండండి' అని కోరారు. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందనేందుకు ఇది స్పష్టమైన సంకేతం. ఇంత ఆనందాన్ని పట్టలేని ఎంపీలు తమ స్నేహితులు, సన్నిహితులతో ఆ సంతోషాన్ని పంచుకున్నారు. రాష్ట్రం నుంచి మరో ఐదుగురికి కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కుతుందని పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ ఈ వార్తలను కొట్టివేసినట్లు సమాచారం. గాంధీభవన్‌లో ఈ నెల 26న జరిగిన సమావేశానికి శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఎంపీ కిల్లి కృపారాణి హాజరయ్యారు. తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని, కేంద్ర మంత్రి పదవి దక్కనుందని ఆమె ముఖ్యమంత్రికి చెప్పారు. దీనిని సీఎం తేలిగ్గా కొట్టిపారేశారు.
"కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇంత ముందుగా సమాచారం ఇవ్వరు. దీనిని నమ్మొద్దు. ఇంకెవరికీ ఈ విషయం చెప్పుకోవద్దు'' అని సలహా ఇచ్చారు. దీంతో.. కృపారాణి సంతోషం ఆవిరైపోయింది. కోట్ల జయ సూర్య ప్రకాశ్‌రెడ్డికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. దాదాపు 15 రోజుల కిందట యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి భేటీ అయ్యారు. మాటల సందర్భంలో విధేయత అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమయంలో సోనియా నోటి నుంచి సూర్యప్రకాశ్ పేరు వచ్చింది. ఆ మంత్రి సూర్యప్రకాశ్ రెడ్డికి ఈ సమాచారం అందించారు. 'ఒకసారి మేడమ్‌ను కలిస్తే మంచిది' అని సూచించారు. అంతే... సూర్యప్రకాశ్ రెడ్డి దంపతులు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి సోనియా ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా అప్పుడే సోనియా చెప్పారు. ఈ సమాచారం మాత్రం ముఖ్యమంత్రికి తెలియలేదు. సర్వే సత్యనారాయణ విషయం సరే సరి. తన సమీప బంధువు వివాహ ఆహ్వాన పత్రికను అందించేందుకు ఆయన ఇటీవల సోనియాగాంధీని కలిశారు.
అయితే మంత్రి పదవులు వచ్చిన వారు సీఎం అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ..తమ సన్నిహితులతో ఆయనేకే సీఎం పదవి రాగా మాకు మంత్రి పదవి రాదా అని అంటున్నారట. సీఎం అంటే చీకట్లో చిదంబరం తో రహస్య మంతనాలు జరిపి ముఖ్యమంత్రి అయ్యాడు. మేము అలా కాదని వారు తొటి కాంగ్రెస్ నాయకులతో అంటున్నట్లు తెలుస్తోంది. ఈ మాటలు నేరుగా కిరణ్ గారి సన్నిహితులకు తెలియటంతో వాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మాటలు విన్న కిరణ్ గారు మాత్రం మనసులో పరువు మొత్తం పోయిందని చాలా భాదపడినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కొంతమంది నాయకులు అయితే ఆయన నోటి దూల వలనే ఇలా జరిగిందని గాంధీ భవన్ లో చెప్పుకుంటున్నారట.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more