ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తో రాయలసీమ పరిరక్షణ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించారు. పెద్దఎత్తున జనంతో కేతవరం గుహలకు చేరుకున్న బైరెడ్డి తన యాత్ర మొదలుపెట్టారు. అక్కడి గుహలపై ఆర్పీఎస్ జెండాను ఎగురవేశారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేశారు. ప్రపంచానికే నాగరికత నేర్పిన ఘనత రాయలసీమ ప్రాంతానికి చెందుతుందని ఈ సందర్భంగా బైరెడ్డి అన్నారు.ఆదిమానవుడు సంచరించాడన్న ఆనవాళ్లు ఉన్న ప్రదేశం కేతవరం గుహలని ఆదిమమానవుడు లిపిని స్రుష్టించింది కూడా ఇక్కడేనని ఆయన అన్నారు.ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించాల్సింది పోయి నిర్లక్ష్యానికి గురువుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అంటే కేవలం ఫ్యాక్షనిస్తులు, నిరక్షరాస్యులు, దౌర్జన్యవాదులుగా ముద్రవేసి సినిమాలలో చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. అసలు సిసలైన రాయలసీమ అంటే ఎంటో చూపిస్తామని బైరెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. రాయలసీమకు మద్దతుగా ఉద్యమంలోకి నడవని సీమనేతలను ప్రజలు సీమ నుంచి బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. సమైక్యాంధప్రదేశ్ లో సీమ వాసులకు మిగిలింది కన్నీళ్లే తప్ప త్రాగడానికి గుక్కెడు నీళ్లు లేవన్నారు. నిరుద్యోగం, వలసలు తప్ప ఉపాధి లేదన్నారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో చాలా కష్టాలు పడ్డామని ఇక సుఖపడాలంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పడాలని ఆయన అన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పడేంత వరకు తమ ప్రాణాలు పోయినా వదిలే ప్రసక్తిలేదంటూ ఆయన పేర్కొన్నారు. కేతవరం గుహల నుంచి ప్రారంభమైన బైరెడ్డి యాత్ర సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకూ సాగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more