శాసనసభ సమావేశాలు ముగుస్తూనే అధికార బీజేపీలో మళ్ళీ కోలాహల వాతావరణం ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప డాలర్స్‌కాలనీలోని తన నివాసంలో తన మద్దతుదారులైన మంత్రులు, ఎ మ్మెల్యేలతో రహస్య మంతనాలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకొం ది. యడ్యూరప్స సేవలు పార్టీ అనివార్యమంటూ అప్ప శిబిరానికి చెందిన మంత్రి రేణుకాచార్య కీలక ప్రకటన చే సిన నేపథ్యంలో ఈ సమావేశానికి రా జకీయ ప్రాధాన్యత ఏర్పడింది. అధిష్ఠానం సూచన మేరకు ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ పలు మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితిల్లోనూ సదానందగౌడ వ ర్గానికి కీలక శాఖలు లభించరాదని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. సదానందగౌడ శిబిరానికి చెందిన మంత్రులు సి.టి.రవి, బచ్చేగౌడ, గోవిందకారజోళ తదితరు లు తమకు ప్రాధాన్యత లేని శాఖలను కేటాయించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. వీరి తరపున వకాల్తా పుచ్చుకొని ఢిల్లీకి వెళ్ళిన సదానందగౌడకు అధిష్టానం నుండి శాఖ ల మార్పుకు స్పష్టమైన హామి లభించినట్లు ప్రచారం జరుగుతోంది. శాసనసభ సమావేశాలనంతరం ఈ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉందని భా వించినట్టుగానే శనివారం పార్టీ కీలక కోర్‌కమిటీ సమావేశం ఏర్పాటవుతోం ది. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకే అప్ప తన అనుచరులతో సమావేశమైనట్లు స మా చారాం. పైగా విధాన పరిషత్‌లో మూ డు స్థానాల నామినేషన్ వ్యవహారంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. వీటిలో రెండు స్థానాలను తాను సూచించిన వారికే కేటాయించాలని,బోర్డు, కార్పొరేషన్ అధ్యక్ష పదవుల్లో తమ వర్గానికి 50శాతం సీట్లు ఇవ్వాలని తదితర ఆరు ప్రముఖ డి మాండ్లతో ఓ జా బితాను అప్పశిబిరం సిద్దం చేసినట్లు తెలిసింది. శుక్రవారం సమావేశానికి మంత్రులు సో మణ్ణ, ఉదాసి, బసవరాజబొమ్మాయి, ఉమేష్‌కత్తి, మురుగేష్ నీరాణి పా ల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more